IPL సీజన్ 17 లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మద్య జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పరుగుల వరద కురిపించింది.ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది.
ఐపీఎల్ అంటేనే ప్రతి ఒక్కరిలో జోష్ నింపుతుంది.ఉప్పల్ వేదికగా జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ అబిమానులకు సరికొత్త జోష్ నింపింది.ఐపీఎల్ చరిత్రలో అత్యదిక పరుగుల రికార్డ్ (277-3) తో అత్యదిక పరుగుల రికార్డ్ సొంతం చేసుకుంది.11 ఏండ్ల ఆర్సీబీ రికార్డ్ 263-5 సరికొత్త రికార్డు సష్టించింది.క్లాసెన్,అభిషెక్ వర్మ ,ట్రావిస్ హెడ్ అర్ధ సెంచరీలతో పరుగుల వరద పారించారు.ఒకే మ్యాచ్ లో ఇరు జట్లు కలిపి 523 పరుగుల రికార్డ్ నెలకొల్పారు.
అబిషేక్ వర్మ 16 బంతుల్లోనే అర్ధసెంచరి పూర్తి చేసాడు.ట్రావిస్ హెడ్ 18 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసాడు.ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు కలిపి 38 సిక్సర్లుతో 523 పరుగుల చేసి సరికొత్త రికార్డు నెలకొల్పారు.సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది.ముంబై ఇండియన్స్ ఐదు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసి 31 రన్స్ తేడాతో ఓటమి చవిచూసింది.