అసెంబ్లీ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ సీఎం రేవంత్ రెడ్డి మార్చారు.ప్రతిపక్ష నేత కు యేళ్ళ తరబడి కేటాయిస్తున్న కార్యాలయం కాకుండా చిన్న రూమ్ ను కేటాయించారు.మొదటి ఆసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ కు గత ప్రతిపక్ష నేతలకు కేటాయించిన కార్యాలయాన్ని కేటాయించి రెండో సమావేశాల్లోపే మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాకిచ్చింది.39 మంది ఎమ్మెల్యేలకు నేతృత్వం వహిస్తున్న ప్రతిపక్ష నేత కార్యాలయాన్ని ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీ కి మార్చడం పై ఎమ్మెల్యేలు ,మీడియా వర్గాల్లో చర్చ మొదలైంది.
ఇక ఇదే విషయమై స్పీకర్ ను కలిసిన Brs ఎమ్మెల్యే లు.అసెంబ్లీలో ఎల్వోపి కార్యాలయం మార్పు గురించి అడిగారు.గతంలో స్పీకర్ ఛాంబర్ కు ఎడమ వైపు ఇన్నర్ లాబీలో ఎల్ఓపి కార్యాలయం ఉండగా ప్రస్తుతం ఔటర్ లాబీలో ప్రధాన ప్రతిపక్ష నేత ఛాంబర్ ఇవ్వడం పట్ల బిఆర్ఎస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గతంలో ప్రతిపక్ష నేతలకు ఇచ్చిన రూం ఇవ్వాలని స్పీకర్ ని అడిగిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు.