balka suman

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మీద కేసు నమోదు చేశారు. మంచిర్యాల కాంగ్రెస్ నాయకుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు. ఈమేరకు మంచిర్యాల ఎస్సై బాల్క సుమన్ కి నోటీసులు అందజేశారు.అయితే గత మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి మీద బాల్క సుమన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.మరో వైపు బాల్క సుమన్ కేసు నమోదు కాగానే తప్పించుకొని నేపాల్ కి పారిపోయాడని నేపాల్ లో ఓ పబ్ లో స్థానికులు గుర్తించారని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది కానీ అదేరోజు ఓ టీవీ స్టూడియో లో చర్చలో పాల్గొని నేనెక్కడికి పారిపోలేదని తప్పుడు వార్తలను బాల్క సుమన్ తిప్పికొట్టారు.కాగా నేడు మంచిర్యాల పోలీసులు బాల్క సుమన్ ని కలిసి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు అందజేసారు.ఈ సందర్భంగా కాంగ్రేస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనమీద ఎన్ని కేసులు పెట్టిన ప్రజల పక్షాన ఉంటానని ఉద్యమ సమయంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నానని పేర్కొన్నారు.

Share