Dundra Kumaraswamy:ఘనంగా మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు
సమసమాజ దార్శనికుడు జ్యోతిబాపూలే- జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
మహాత్మా జ్యోతి రావు ఫూలే ఆదర్శప్రాయుడని, ఆయన పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు. బుదవారం నాడు ఫూలే జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ జిల్లా లో జాతీయ బీసీ దళ్ ప్రధాన కార్యాలయంలో మహాత్మా జ్యోతి రావు ఫూలే ఉత్సవాల కమిట్ ఛైర్మన్ మహేంద్ర బాబు & ఉత్సవాల కమిటీ కార్యదర్శి ఎం ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు దుండ్ర కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫూలే చిత్రపటానికి పూల మాలలు వేసి జ్యోతి ప్రజ్వలనచేసి నివాళులర్పించారు. ఘనంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిబా పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. అణగారిన వర్గాల వారి హక్కుల కోసం, స్త్రీల సమానత్వం కోసం ,పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త, వ్యక్తిగత జీవితాలను సమాజం కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తుల్లో మహాత్మ జ్యోతిబా పూలే ఒకరని.. మహాత్మా జ్యోతిబాపూలే చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పట్లో సమాజంలోని అంటరానితనం, ఎన్నో సాంఘీక దురాచారాలను ఎదుర్కొన్నారు జ్యోతిబాపూలే. విద్య కోసం, ప్రత్యేకించి మహిళా విద్య, అంటరానితనాన్ని రూపుమాపేందుకు కృషి చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాపూలే. మహాత్ముల జీవిత చరిత్రలను తెలుసుకొని వారి అడుగుజాడల్లో నడిస్తే మన జీవితాలు కూడా బాగుపడతాయి.. వారి జీవిత ఆశయాలను నెరవేరిస్తే నలుగురికి సహాయం పడినట్లేనని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. సమాజంలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారిని తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలని పిలుపునిచ్చారు.
మహాత్మ జ్యోతిబాపూలే సామజిక విప్లవకారుడిగా అవతరించి బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని దుండ్ర కుమారస్వామి అన్నారు. స్వాతంత్య్రోద్యమానికి ముందు సాంఘిక సంస్కరణోద్యమం ద్వారా సమాజంలోని వివిధ రుగ్మతలను రూపుమాపేందుకు పూలే విశేష కృషి చేశారన్నారు. పూలే దంపతులు సమాజం కోసం తమ జీవితాన్ని త్యాగం చేశారన్నారు. ఫూలే తన భార్య సావిత్రి బాయికి విద్యాబుద్ధులు నేర్పించి మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా చరిత్రలో నిలిచిపోయేలా చేశారు.. ఆమె స్ఫూర్తితోనే ప్రస్తుతం మహిళలు ఉన్నత విద్యావంతులై అన్ని రంగాల్లో రాణిస్తున్నారని దుండ్ర కుమారస్వామి అన్నారు. అణగారిన వర్గాల ఎదుగుదలకు విద్యనే ఆయుధమని భావించి పాఠశాలలు నెలకొల్పారని, స్త్రీ విద్యను ప్రోత్సహించారని, బాల్య వివాహాలను వ్యతిరేకించి, వితంతు వివాహాలకు నాంది పలికారని దుండ్ర కుమారస్వామి వివరించారు. అన్ని వర్గాల వారికి విద్య, ఉపాధి, రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు మహాత్మ జ్యోతిబా పూలే కృషి చేశారని దుండ్ర కుమారస్వామి అన్నారు.ఈ కార్యక్రమము లో
కుల సంఘాలు , బీసీ సంఘాలు ,విద్యార్థి యువజన సంఘాలు ప్రతినిధులు, మహేంద్ర బాబు, బీసీ దళ్ కార్యదర్శి ప్రశాంత్, ప్రొఫెసర్ కేశవ్,
సాయి యాదవ్, బీసీ నేతలు పాల్గొన్నారు.