mother cng station

దేశ వ్యాప్తంగా 12 కోట్ల గృహాలకు పైప్ ద్వారా వంట గ్యాస్ సరఫరా

పీ ఎన్ జి ఆర్ బి సభ్యుడు అంజనీ కుమార్ తివారి వెల్లడి

తెలంగాణాలోని మహాబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని బోడజనం పేట గ్రామంలో గృహా అవసరాలకు అనుగుణంగా మేఘా గ్యాస్ సరఫరా చేస్తున్న మొదటి పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ ను, సౌత్ ఆసియన్ సిరామిక్ టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పిఎన్జి కనెక్షన్ ను పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ మెంటర్ అంజనీకుమార్ తివారి గురువారం ప్రారంభించారు. వీటితో పాటు ఈ ప్రాంతంలో నేచురల్ గ్యాస్ సరఫరా చేయడానికి వీలుగా పోలేపల్లి పారిశ్రామిక ప్రాంతంలో మధర్ సిఎన్జి స్టేషన్ ను ప్రారంభించారు.దీని ద్వారా గృహా,పారిశ్రామిక,వాణిజ్య అవసరాలతో పాటు,వాహానాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ సరఫరా చేయనుంది మేఘా గ్యాస్.

ఈ సందర్భంగా పిఎన్జిఆర్బి మెంబర్ అంజనీకుమార్ తివారి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా పిఎన్జిఆర్బి చేస్తున్న పిఎన్జి డ్రైవ్ లో భాగంగా ఈరోజు గృహా,పారిశ్రామిక అవసరాలకు మేఘా గ్యాస్ ద్వారా పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.దేశంలోని సిజిడి రంగంలో కీలకమైన పది రాష్ట్రాల్లోని 22 జియోగ్రాఫికల్ ఏరియాల్లో నేచురల్ గ్యాస్ సరఫరా చేస్తూ మేఘా గ్యాస్ అగ్రగామిగా ఉందన్నారు. పిఎన్జిఆర్బి దేశ వ్యాప్తంగా 12కోట్ల మందికి పిఎన్జి కనెక్షన్లు అందించాలని లక్ష్యం పెట్టుకోగా,ఇందులో మేఘా గ్యాస్ 1.3కోట్ల కనెక్షన్లు అందించనుందని, 17000కు పైగా సిఎన్జి స్టేషన్లు ఏర్పాటు చేయనుండగా వీటిలో 2200కు పైగా సిఎన్జి స్టేషన్లు ఏర్పాటు చేయనుందని అన్నారు. పట్టణప్రాంతాల కంటే ముందు గ్రామీణ ప్రాంతాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లు అందించేలా దృష్టిపెట్టామని,ఇందులో భాగంగా శరవేగంగా 120 కిలోమీటర్ల పైప్లైన్ నిర్మాణ పనులు పూర్తి చేసిన మేఘా గ్యాస్ ను అభినందించారు అంజనీకుమార్ తివారి.దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ముఖ్యంగా గ్రామాలకు ఇంటింటికీ పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు 35వేల కిలోమీటర్ల పైప్లైన్ నిర్మిస్తున్నామని అన్నారాయన.

ఈ కార్యక్రమంలో మేఘా గ్యాస్ డైరెక్టర్ సి ఈ ఓ పలింపాటి వెంకటేష్ మాట్లాడుతూ మేఘా గ్యాస్ మహాబూబ్నగర్ జియోగ్రాఫికల్ ఏరియాలో కాలుష్యరహిత గ్రీన్ ఇంధనాన్ని సరఫరా చేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తోందని,అదేవిధంగా దేశ వ్యాప్తంగా నేచురల్ గ్యాస్ సేవలు విస్తరించే పనిలో భాగంగా ఇప్పటికే మధ్యప్రదేశ్ లోని ఛింద్వారాలో మొదటి ఎల్సిఎన్జి ప్లాంట్ ప్రారంభించగా,సాగర్,పంజాబ్లోని తరంతరన్,తమిళనాడులోని తిరువణ్ణామలై ప్రాంతాలలో సైతం త్వరలోనే ఎల్సిఎన్జి ప్లాంట్లను ప్రారంభించనున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మేఘా గ్యాస్ ఛీప్ జనరల్ మేనేజర్ తిమ్మారెడ్డితో పాటు,మేఘా గ్యాస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share