lasya nanditha

కంటోన్మెంట్ నియోజకవర్గంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృత్యువాత పడ్డారు.పఠాన్ చెరువు ఓఅర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు.XL 6 కారు డివైడర్ ను ఢీకొట్టడంతో కారు పల్టీలు కొట్టింది దింతో ఎమ్మెల్యే లాస్య స్పాట్ లోనే చనిపోయారు.

ఇక ఎమ్మెల్యే లాస్య నందితను ప్రమాదాలు వెంటాడాయి.నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో లిఫ్ట్ లో చిక్కుకొని అదృష్టం కొద్దీ బయడటపడింది.మరోసారి నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెండవ సారి‌ ప్రమాదానికి గురై బయటపడింది.మూడవ సారి ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో గండాన్ని గట్టెక్కలేక యువ‌ ఏమ్మెల్యే లాస్య మృత్యువాత పడ్డారు.

సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించిన దివంగత ఎమ్మెల్యే సాయన్న గత ఏడాది ఫిబ్రవరి నెల 19 వ తేదీన చనిపోయారు.తండ్రి రాజకీయ ఆశయాలను కొనసాగించడానికి రాజకీయాల్లోకి వచ్చిన లాస్య ఎమ్మెల్యేగా గెలిచారు.అయితే అనతికాలంలోనే తండ్రి సాయన్న ఆశయాలు నెరవేర్చకుండానే ఇలా మృత్యువాత పడడం నియోజకవర్గంలో, బీఆర్ ఎస్ పార్టీలో తీవ్ర విషాద చాయలు నెలకొన్నాయి.

Share