inde racing

Inde Racing

భారత్‌కు చెందిన ఇండీ రేసింగ్‌ తమకు చెందిన ఈవీ అడ్వాన్స్‌మెంట్స్‌ను మిసానో వేదికగా జరిగే ఏబీబీ ఎఫ్‌ఐఏ ఫార్ములాఈ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ప్రదర్శించబోతున్నది

ప్రపంచంలోనే తొలి మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిల్స్‌లో కూడుకున్న ఎఫ్‌ఐఎమ్‌ వరల్డ్‌కప్‌..ఏబీబీ ఎఫ్‌ఐఏ ఫార్ములా-ఈ చాంపియన్‌షిప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2024 మిసానో ఈ ప్రిక్స్‌ సందర్భంగా ట్రాక్‌కు సంబంధించిన విషయాల్లో పాలుపంచుకోనున్నది.

దీని ద్వారా ఇరు పక్షాలకు చెందిన ప్రతినిధులు ఒకే వేదికపైకి తీసుకురానుంది. ఇందులో ఎకోసిస్టమ్‌ కింద జట్లు, నిర్మాణదారులు, భాగస్వాములు, సీనియర్‌ ప్రతినిధులు..లండన్‌ ప్రధాన కేంద్రంలో వ్యూహాత్మక వర్క్‌షాపుల్లో పాల్గొంటారు. ఈ సెషన్స్‌లో ముఖ్యంగా నాలెడ్జ్‌ షేరింగ్‌, మ్యూచువల్‌ లర్నింగ్‌, ఈవీ టెక్నాలజీ అభివృద్ధిపై నిరంతర పరిశోధనలు జరుగుతాయి. ట్రాక్‌పై కట్టింగ్‌ఎడ్జ్‌ ఈవీ టెక్నాలజీని పరిశీలిస్తూ ..చాంపియన్స్‌ సందర్భంగా కన్జూమర్‌ అప్లికేషన్‌కు అనుగుణంగా రేసింగ్‌పై మరింత అవగాహన పెంచుకునేందుకు మరియు చర్చించేందుకు ఆస్కారం లభించనుంది.

ఇటీవల జపాన్‌ వేదికగా జరిగిన తొలి ఎఫ్‌ఐఎమ్‌ గ్లోబల్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ నుంచి తొలి టీమ్‌గా పోటీపడ్డ ఇండీ రేసింగ్‌ పోడియం ఫినిష్‌ చేసింది. ఇదే ఊపులో ఏప్రిల్‌ 13-14 తేదీల్లో జరిగే మిసానో ఈ ప్రిక్స్‌ డబుల్‌ హెడర్‌లో ఇండీ రేసింగ్‌ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉంది. మిసానో ట్రాక్‌పై ఇండీ రేసింగ్‌ టీమ్‌తో పాటు పలు జట్లు ఆఫ్‌రోడ్‌ డిమాన్‌స్ట్రేషన్‌, గ్రౌండ్‌ నలువైపులా ఈ-బైక్స్‌, మోటార్‌సైకిల్‌ రేసింగ్‌పై మరింత అవగాహన పెంచుకోనున్నాయి. దీంతో పాటు ఇటలీకి చెందిన ప్రఖ్యాత ఆటోమోటివ్‌, మోటార్‌స్పోర్ట్స్‌ హార్ట్‌ల్యాండ్‌లో అభిమానులకు మరింత మజాను అందించనుంది.

నాలెడ్జ్‌ను పంచుకోవడం ద్వారా మరింత అవగాహన పెంచుకోవడంతో పాటు ఈవీ టెక్నాలజీ అభివృద్ధిపై కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం లభించనుంది. రేస్‌ డే సందర్భంగా కన్జూమర్‌ అవసరాలకు అనుగుణంగా రెండు చాంపియన్‌షిప్‌లకు చెందిన కట్టింగ్‌ ఎడ్జ్‌ ఈవీ టెక్నాలజీ, ట్రాక్‌, టీమ్స్‌, మానుఫాక్చరర్స్‌, పార్ట్‌నర్స్‌, సీనియర్‌ ప్రతినిధులు చర్చించుకునేందుకు, అవి ఎలా ప్రభావం చూపిస్తున్నాయన్న దానిపై భేటీకి మంచి ఆస్కారం లభిస్తుంది.

ఇండీ రేసింగ్‌ సీఈవో అభిషేక్‌రెడ్డి మాట్లాడుతూ ‘ఈ భాగస్వామ్యం ద్వారా భారత మోటార్‌రేసింగ్‌ను గ్లోబల్‌ వేదికపై మరింతగా ప్రాచుర్యం కల్పించేందుకు మంచి వేదికగా భావిస్తున్నాం. దీని ద్వారా అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ట్రెయిన్‌ టెక్నాలజీ బాగా ఉపయోగపడనుంది. దీనికి తోడు ఎలక్రిక్‌ మోటార్‌స్పోర్ట్స్‌లో మరింత ఉన్నత శిఖరాలు అందుకునేందుకు ఇది దోహదపడనుంది. ఇండీ రేసింగ్‌ యజమానిగా..పునరుత్పాదక రేసింగ్‌ టెక్నాలజీ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం. ఆటోమోటివ్‌ ఇండస్ట్రీలో ఇటు భారత్‌తో పాటు గ్లోబల్‌గా ఎలక్ట్రిక్‌ రేసింగ్‌ ఫై ఫెర్ఫార్మెన్స్‌ క్యాటలిస్టుగా దోహదపడనుంది అని అన్నారు.

ఎఫ్‌ఐఎమ్‌ ఈ-ఎక్స్‌ ప్లోరర్‌ ప్రపంచకప్‌ రెండో రౌండ్‌ నార్వేలో మే 3,4 తేదీల్లో జరిగే మూడు వారాల ముందు మిసానో ఈ ప్రిక్స్‌లో ఈ-ఎక్స్‌ప్లోరర్‌పై చర్చ జరుగనుంది.

Share