CPI Narayana

CPI Narayana

సినీనటుడు నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేసిన ప్రాంతాన్ని రాష్ట్ర నాయకులతో కలిసి సందర్శించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ

చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేసి ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా పై సిపిఐ నారాయణ ప్రశంసలు కురిపించారు.హైడ్రా కూల్చివేతలను సీపీఐ పార్టీ తరపున స్వాగతిస్తున్నామని ప్రకటించారు.హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువులు కుంటలు కాలువలను బడాబాబులు కబ్జా చేసి కట్టడాలు కట్టి ఆక్రమించారని నారాయణ అన్నారు.

పోరంబోకు భూములు, చెరువులు ట్యాంకులు ఇంజనీరింగ్ కాలేజ్ లు, ఫంక్షన్ హాల్  అక్రమ నిర్మాణాలు చేపట్టారని గతంలో మేము ఎన్నో పోరాటాలు చేసాము అప్పటి ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని గత బీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు.

చెరువులు, కుంటలు నాళాలు ఖాళీ చేసేందుకు హైడ్రా ఏర్పాటు చేశారని ఎన్ కన్వెన్షన్ అధినేత నాగార్జున.. బిగ్ బాస్ కే బాస్…నాగార్జున సినిమా యాక్టర్ కావచ్చు…సినిమాలో నటించడంతోపాటు బిగ్ బాస్ లోనే వందల కోట్ల వస్తాయని అలాంటి నాగార్జునకు ఎందుకు అంత కక్కుర్తి ..చెరువు ఎఫ్ టి ఎల్ లో ఫంక్షన్ హాల్ కట్టడం ఏంటి..అని ప్రశ్నించారు.

చెరువును ఆక్రమించి నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ లో సంపాదించిన డబ్బును కక్కించాలని ప్రభుత్వాన్ని కోరారు.నష్టపరహారం కూడా కట్టించాలి..అలా వచ్చిన డబ్బులతో పేదవారికి ఇల్లు కట్టించాలని అన్నారు.

మాజీమంత్రి మల్లారెడ్డి కూడా కబ్జాకోరు అని ఆయనతో పాటు మరి కొంతమంది కబ్జా కొరులు ఉన్నారు..పైకి రాజకీయ నాయకులుగా నటిస్తూ లోపల  కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.హైదరాబాద్ లో నాళాలు చెరువుల కుంటలు, కబ్జాలు కావడంతోపదినిమిషాలు వర్షం పడితే నగరం నరకంగా మారుతుందని అన్నారు.

మధ్యతరగతి పేదవారు నోటరీ భూముల్లో ఇల్లు కట్టుకున్నారు..అలాంటి వారికి రెగ్యులర్ చేయండి..కానీ అలాంటి వారి పొట్ట కొట్టమాకండి..సి.ఎం రేవంత్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టవద్దు..పారదర్శకంగా వ్యవహారించాలి..ఏ పార్టీ వారైన అక్రమ నిర్మాణం చేపట్టిన కూల్చి వేయాలని సూచించారు.మేము కూడా హైడ్రా కట్టడాలను కూల్చివేతను పరిశీలిస్తాము..కబ్జా కొరులు ఎం‌.ఐ.ఎం పార్టీ నేతలు ముందు అలాంటి వాళ్ళ అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేయండి..కోర్టులు కూడా అక్రమ నిర్మాణాల స్టే వ్యవహారంలో ఆచితూచి వ్యవహరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Share