cm revanth reddy

అసెంబ్లీలో బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

అసెంబ్లీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ ప్రసంగం లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపారు.ఇందులో ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పులను ప్రస్తావిస్తూ తన ప్రసంగం కొనసాగించారు.ప్రగతి భవన్ లో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో కలిసి లంక మీటింగ్ లో ఆంధ్రాకు నీళ్లు తరలించడానికి కుట్ర పన్నారని అన్నారు.ఎన్నికల ముందు నాగార్జున సాగర్ డ్యామ్ పై జగన్మోహన్ రెడ్డి పోలీసులతో పహారా కాస్తే కనీసం అడ్డుకోలేదని విమర్శించారు. ఇద్దరు కలిసి తెలంగాణ రైతాంగానికి తీవ్ర అన్యాయం చేశారని అన్నారు.ఇక యాసంగి రైతు బందు కి ఏకంగా తొమ్మిది నెలల సమయం తీసుకున్నారని మేం వచ్చి రెండు నెలలే అయిందని రైతు బంధు విడతల వారిగా చెల్లిస్తున్నామని అన్నారు.ప్రతిపక్ష నేతలు కొత్త ప్రభుత్వానికి తమ సూచనలు ఇవ్వాల్సింది పోయి ఇంకా అధికార దాహం కోసం కొట్లాడుతున్నారాని ఇలాగే ఉంటే ప్రజలు ప్రతిపక్షము నుండి కూడా దూరం చేస్తారని ఎద్దేవా చేశారు.ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి ప్రజా భవన్ గా మార్చామని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజా పాలన అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.కృష్ణ జలాల కోసం కొట్లాడాల్సింది ఢిల్లీలో అని జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తే తాము పోలీస్ సెక్యూరిటీ కల్పిస్తామని చేసిన తప్పు ఒప్పుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు.ప్రొఫెసర్ జయశంకర్ సొంత ఊరికి రెవెన్యూ విలేజ్ గా ప్రకటించాలని కోరగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిందని తమ ప్రభుత్వం ఏర్పడగానే రెవెన్యూ విలేజ్ గా ప్రకటించామని అన్నారు.కాళోజీ క్షేత్రం పనులు తొమ్మిదన్నార ఏళ్ల క్రితం ప్రారంభించారు అవి ఇప్పటికి కాలేదు మా ప్రభుత్వం కాళోజీ కళా క్షేత్రం పూర్తిచేస్తుందని తెలిపారు.ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతిపక్ష నేతలు విలువైన సమాచారం ఇవ్వాలని ఏ పార్టీ నేత అయిన తనను వచ్చి కలవచ్చని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.తొమ్మిదన్నర సంవత్సరాలలో తెలంగాణ విధ్వంసం జరిగిందని తెలంగాణను పునరుద్ధరించాల్సిన బాధ్యత మన మీద ఉందని అన్నారు.

Share