బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు.తెలంగాణ సమాజం పట్ల, రైతులపట్ల గౌరవం ఉంటే ప్రధాన ప్రతిపక్షం మేడిగడ్డ కు వచ్చేది అని కానీ ప్రజలపై రైతులపై ప్రతిపక్షాలకు ఏ మాత్రం గౌరవం లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.పదే పదే బీఆర్ఏస్ నేతలు భాష గురించి మాట్లాడుతున్నారు కాని మాజీ సీఎం నల్లగొండలో మాట్లాడిన భాషపై చర్చిద్దామా? అని సభ్యులను ప్రతిపక్ష నేతలను ప్రశ్నించారు.ఒక సీఎంను పట్టుకుని ఎం పీకనీకి పోయారా అని అంటారా? ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో మీ ప్యాంటు పీకేశారని అయినా బీఆర్ఎస్ నేతలకు బుద్ధి రాలేదని అన్నారు.మేడిగడ్డ కుంగిపోతే.. అందులో నీళ్లు నింపడానికి అవకాశం ఉంటదా? అని ప్రశ్నించారు.కడియం శ్రీహరి, హరీష్ లకే పెత్తనం ఇస్తాం నీళ్లు నింపి చూపించండి అని అన్నారు.చర్చకు సిద్ధమైతే మీ సభాపక్ష కేసిఆర్ ను అసెంబ్లీకి రమ్మనండి అని అన్నారు.కాళేశ్వరంపై, నదీ జలాలపై చర్చకు మేం సిద్ధం అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నల్గొండ సభలో చంపుతారా అని కేసిఆర్ అంటుండు..చచ్చిన పామును ఎవరైనా చంపుతారా? అని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేసారు.మీరు చెప్పినట్టు మెడిగడ్డలో రెండో మూడో పిల్లర్లు కుంగినయంటే సభలో చర్చ చేద్దాం రండి అని కోరారు.సభకు రావాల్సింది పోయి పారిపోయి అక్కడెక్కడో ప్రగల్భాలు పలకడం కాదని అసేంభ్లీకి రావాలని కోరారు.సాగునీటి ప్రాజెక్టులపై శ్వేత పత్రం పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానిపై చర్చించండని కాళేశ్వరంపై కూడా మేం చర్చకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు..