singer chinmayi సింగర్ చిన్మయి శ్రీపాద పై కేసు నమోదు
HCU విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు మేరకు సింగర్ చిన్మయి శ్రీపాద పై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు.వివరాల్లోకి వెలితే స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద భారత దేశం పట్ల మాట్లాడిన అగౌరవమైన & అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తు, HCU విద్యార్థి కుమార్ సాగర్ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ చేసాడు.సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఓ ఇంట్ర్వూలో చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా సింగర్ చిన్మయి శ్రీపాద మాట్లాడుతూ మధ్యలో భారత దేశాన్ని స్టుపిడ్ కంట్రీ( చెత్త దేశం) గా, భారత దేశంలో పుట్టడం నా కర్మ అని చిన్మయి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అన్నారని అన్నపూర్ణమ్మకి ఏమైనా చెప్పాలనుకుంటే అమె గురించి మాత్రమే చెప్పాలి కానీ భారత దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం సరైన పద్ధతి కాదని భారతదేశంలో ఉంటూ భారతదేశ సౌకర్యాలు అనుభవిస్తూ, భారత దేశపు గాలి పీల్చి. భారత దేశం లో పుట్టడమే కర్మ అనడం, భారతదేశం ఒక చెత్త దేశం అని అనటం బాధని మరియు కోపాన్ని కలిగించే విషయం అని కంప్లైంట్ లో పేర్కోన్నాడు. బాధ్యత గల పౌరుడిగా భారత దేశం పట్ల అగౌరవమైన & అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని సింగర్ చిన్మయి శ్రీపాద పై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరడం జరిగింది.
HCU విద్యార్థి కుమార్ సాగర్ ఫిర్యాదు