shanmukh

shanmukh గంజాయితో పట్టుబడ్డ షణ్ముక్

ప్రముఖ యూట్యూబర్ షణ్ముక్ జశ్వంత్ గంజాయితో పోలీసులకు చిక్కాడు.వివరాల్లోకి వెళితే షణ్ముక్ సోదరుడు సంపత్ వినయ్ ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు ఎంగేజ్మెంట్ కూడా అయింది అయితే మరో యువతిని పెళ్లి చేసుకోవడంతో మోసపోయానని గ్రహించిన యువతి షణ్ముక్ సోదరునిపై పోలీసులకు పిర్యాదు చేసింది.

సంపత్ వినయ్ మీద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునేందుకు షణ్ముక్ ఇంటికి వెళ్లారు అయితే అక్కడ షణ్ముక్ ఒక్కడే ఉన్నాడు.అయితే అక్కడ పోలీసులకు అనుకోని సంఘటన ఎదురైంది. షణ్ముక్ వద్ద గంజాయి లభించడంతో వెంటనే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

పదేళ్లుగా షణ్ముక్ సోదరుడు సదరు యువతితో ప్రేమ నటించి ఎంగేజ్మెంట్ అయ్యాక మోసం చేశాడని పోలీసులకు పిర్యాదు చేయడం,పోలీసులు షణ్ముక్ ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించడం అక్కడ గంజాయి తో షణ్ముక్ దొరకడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Share