gruha jyothi

ఆధార్ లింక్ ఉంటేనే ఉచిత కరెంట్

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి.ఇప్పటికే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం అందుతుండగా మరో గ్యారెంటి అమలుకు కార్యాచరణ సిద్ధం చేశారు.

గృహజ్యోతి పథకం లో బాగంగా ఉచిత కరెంట్ కి ఆధార్ తప్పనిసరి అంటూ గైడ్లైన్స్ విడుదల చేసారు.విద్యుత్ శాఖ నుండి దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.గృహజ్యోతి పథకం ద్వారా లబ్ది పొందాలనుకునేవారు ఆధార్ ధృవీకరించుకోవాలని రాష్ట్ర ఇంధనశాఖ ఉత్తర్వులిచ్చింది.ఈ పథకాలను పక్కాగా అమలుచేయాలంటే ఆధార్ గుర్తింపు కార్డు ఉండాలని పేర్కొంది.

ఈ పథకం అమలు కోసం ఉత్తర్వులోని నిబంధనలకు అనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిస్కములకు ఆదేశాలు జారీచేశారు.లబ్ధిదారులు తమ పేర్లు నమోదు కోసం ఇంటి కరెంటు కనెక్షన్ ఎవరి పేరు మీద ఉందో వారి ఆధార్ విద్యుత్ సిబ్బందికి అందజేసి దరఖాస్తు చేసుకోవాలి.

ఆధార్ లేనివారు కొత్త కార్డు దరఖాస్తు చేసుకొని అది వచ్చేవరకు ఏదైనా గుర్తింపు కార్డు అందజేసి పేరు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇందులో పాన్ కార్డు,డ్రైవింగ్ లైసెన్స్,ఉపాధి హామీ కార్డు,ఓటర్ కార్డు,పాస్పోర్ట్, రేషన్ కార్డు చూపించి తమ పెరి నమోదు చేసుకోవచ్చని అవకాశం కల్పించారు..

ఆధార్ ధ్రువీకరణ కోసం బయోమెట్రిక్ తప్పనిసరి ఇందులో వేలిముద్రలు కానీ రెటీనా స్కాన్ కానీ చేయాలి.ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే మొబైల్ కి వచ్చే ఓటీపీతో ధ్రువీకరణ చేయాలి.ఇలా చేసి ఆధార్ ధ్రువీకరణ చేయాలని డిస్కంలకు రాష్ట్రప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది

Share