telangana assembly review meeting

Telangana Assembly:తెలంగాణ బడ్జెట్ సమావేశాలపై సమీక్ష

తెలంగాణ శాసన సభ స్పీకర్ ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర సీఎస్ శాంతా కుమారి ,డిజిపి జితేందర్ , వివిధ శాఖల ఉన్నతాధికారులతో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ,శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ నెల 23 తేదీన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెట్టిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉన్నందున ముందస్తుగా తగిన ఏర్పాట్లు ప్రారంభించాలని ఈ సమావేశంలో చర్చించారు. అలాగే శాసన సభ , శాసన మండలి , లేజిస్లేచర్ సెక్రటేరియట్ లో పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇప్పుడే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం వలన సమావేశాలు నిర్వహించే నాటికి పనులన్నీ పూర్తి చేసే అవకాశం ఉంటుందని వివరించారు. జిల్లాల్లో ప్రొటోకాల్ వివాదాలు తలెత్తకుండా , అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలకు , సుదూర ప్రాంతాల పర్యటనలకు వెళ్ళినప్పుడు తగిన భద్రత ,బందోబస్తు కల్పించాలని శాసన మండలి ఛైర్మన్ ,స్పీకర్ పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్ళేటప్పుడు ఎయిర్ పోర్ట్ లలో కూడా తగిన ప్రొటోకాల్ పాటించేలా చూడాలన్నారు.
ఈ సమావేశంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ , తెలంగాణ లేజిస్లేచర్ సెక్రెటరీ డా” నరసింహా చార్యులు , విప్ రామచంద్రు నాయక్ , వివిధ శాఖల ఉన్నతాధికారులు , తదితరులు, పాల్గొన్నారు .

Share