Chiranjeevi Bandi Sanjay

Chiranjeevi-Bandi Sanjay:చిరంజీవితో బండి సంజయ్ భేటీ

ప్రముఖ సినీనటుడు పద్మవిభూషణ్ చిరంజీవితో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసానికి వెళ్లిన బండి సంజయ్ కి చిరంజీవి సాదర స్వాగతం పలికారు.శాలువతో సత్కరించి ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీరు ఎంతో కష్టపడి పైకొచ్చారు మీరు కేంద్ర మంత్రి కావడం సంతోషంగా ఉందని మీ శ్రమ,కృషికి తగ్గ ఫలితం పదవి లభించిందని బండి సంజయ్ ని ఉద్దేశించి చిరంజీవి అన్నారు.బండి సంజయ్ స్పందిస్తూ విద్యార్థి దశ నుండి మీ సినిమాలకు అభిమానినని చిరంజీవికి తెలిపారు. ఆంద్రప్రదేశ్ లో జనసేన, బిజెపి,టిడిపి కూటమి మంచి ఫలితాలను ఇచ్చిందని కూటమి ప్రజలకు మంచి పాలన అందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం దేశ, రాష్ట్ర రాజకీయాలపై కాసేపు ముచ్చటించుకున్నారు.ఆంద్రప్రదేశ్ సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రధాని మోదీ తమను దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా మాట్లాడటం మర్చిపోలేని అనుభూతి మిగిల్చిందని చిరంజీవి పేర్కొన్నారు.

Share