BRS MLAs కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యెల వలసలు

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యెల వలసలు కొనసాగుతున్నాయి.ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యెలు దానం నాగేందర్‌,తెల్లం వెంకట్రావు,కడియం శ్రీహరి,పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకొగ తాజాగా జగిత్యాల ఎమ్మెల్యె సంజయ్ కుమార్ సైతం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

cm revanth reddy

పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పీసీసీ అద్యక్షుడు,సీఎం రేవంత్ రెడ్డి దూకుడు మీదున్నాడు.ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ను ఖాళీ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.ఓ వైపు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కోసం పనిచేస్తూనే మరోవైపు రసవత్తవరమైన రాజకీయం చేస్తూ ప్రతిపక్ష పార్టీలకు చుక్కలు చూపిస్తున్నాడు.బీఆర్ఎస్ ను ఖాళి చేయడమే అన్నవిదంగా రేవంత్ అడుగులు పడుతున్నట్టు స్పష్టంగా తెలుస్తుందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.

cm revanth reddy

ఈ అసెంబ్లీ ఏన్నికల్లో బీఆర్ఎస్ 39 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంది కాగా ఇందులో కంటోన్మేంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రొడ్డు ప్రమాదంలో మరణించగా ఉప ఎన్నకలో ఆ సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది.ఐదుగురు ఎమ్మెల్యెలు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో 33 మంది ఎమ్మెల్యెలు మాత్రమే ఉన్నారు అయితే అందులో ఎందరు బీఆర్ఎస్ పార్టీలో ఉంటారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

Share