KTR
ధాన్యం అమ్మకం, సన్న బియ్యం కొనుగోలులో 1000 కోట్ల రూపాయల కాంగ్రెస్ కుంభకోణంపైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
15 రోజుల కింద ఈ కుంభకోణాన్ని మా పార్టీ బయటకు తీసినా ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదని అన్నారు.ఈ కుంభకోణం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గానీ, ఉత్తంకుమార్ రెడ్డి గారి ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడలేదని మేము లేవనెత్తిన ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేదని అన్నారు.
BRS అంటే స్కీములు, కాంగ్రెస్ అంటే స్కామ్ లు గల్లిమే లూటో, ఢిల్లీలో భాటో అన్నదే కాంగ్రెస్ నీతికాంగ్రెస్ అంటే కుంభకోణాల కుంభమేళా అని మండిపడ్డారు.ధాన్యం సేకరణపైన దృష్టి పెట్టకుండా రైతన్నల నుంచి సేకరించిన ధాన్యం పైన కన్ను వేసి ఈ స్కాంకి, అవినీతి చీకటి దందాకు తెరలేపారని ఇప్పటికే రాష్ట్రంలో B టాక్స్, U టాక్స్, ఆర్ఆర్ టాక్స్ రాజ్యమేలుతుంది ఇప్పుడు మీకు ఈ కుంభకోణం లో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఢిల్లీ పెద్దల ప్రమేయం కూడా ఉందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే పని చేతనైత లేదు కానీ… తమ జేబులు నింపుకొని ప్రయత్నం చేస్తున్నారని 35 లక్షల ధాన్యం నమ్మకం కోసం గ్లోబల్ టెండర్ల పేరుతో పిలిచిన మొదటి స్కాం..2.20 లక్షల టన్నుల సన్న బియ్యం కొనుగోలు పక్రియ రెండో కుంభకోణం..మొత్తం వెయ్యి కోట్ల రూపాయల స్కాం జరిగిందని ధాన్యం అమ్మకం కోసం అవినీతి కుట్రకు తెర తీసిందని అన్నారు.
జనవరి 25వ తేదీన కమిటీ వేసి, అదే రోజున కమిటీ ఏర్పాటు చేసి, ఈరోజు మార్గదర్శకాలు విడుదల చేసి, అదే రోజు టెండర్లను పిలిచింది హామీల అమలులో లేని ఈ జెడ్ స్పీడు అవినీతి సొమ్ము కోసం మాత్రం కాంగ్రెస్ పెద్దలు చూపించారు ధాన్యంకు 2100 క్వింటాలు చొప్పున స్థానికంగా రైస్ మిల్లు కొంటాం అన్న ఇవ్వకుండా, అర్హత నిబంధనలో మార్పులు చేసి గ్లోబల్ టెండర్ల పేరుతో కుట్రకు తెరలేపింది ఈ గ్లోబల్ టెండర్లను.. కేంద్రీయ భండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే సంస్థలు దక్కించుకున్నాయి.ఈ సంస్థల్లో కేంద్రీయ బండాను మా ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెడితే… ఆ సంస్థకు నిబంధనలో మినహాయింపు నుంచి బ్లాక్ లిస్టు కంపెనీని టెండర్లను పాల్గొనేలా చేసింది టెండర్ లో క్వింటాలుకు రూ.1885 నుంచి రూ.2007కు కోట్ చేసి.. దక్కించుకున్నాయి 93 నుంచి 200 రూపాయల తక్కువకు గ్లోబల్ టెండర్లు పిలిచి కట్టబెట్టారు.కానీ గోదాముల్లో ఉన్న ధాన్యాన్ని తీసుకెళ్లకుండా..ఈ నాలుగు సంస్థలు కేవలం ధాన్యం మాత్రమే సేకరించుకుని వెళ్లాలి కానీ… మిల్లర్లతో డబ్బులు తీసుకొని మనీ లాండరింగ్ పాల్పడుతున్నాయి క్వింటాలుకు రూ.2230 తమకు చెల్లించాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 వేల రైస్ మిల్లర్లను.. ఈ కాంట్రాక్ట్ సంస్థలు బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి.
ఇందుకు కాంట్రాక్ట్ సంస్థలు చెబుతున్న కారణాలు….సీఎం పేషీకి ఖర్చయిందట..
ఢిల్లీ ఏఐసీసీ పెద్దలకు వాటాలు పంపించారట..
ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖజానా నింపారట..
అందుకే క్వింటాలుకు కనీసం 150 రూపాయల వరకు అదనంగా కలిపి చెల్లించాలని రైస్ మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నారు.ఈ మేరకు అదనపుగా డబ్బులు ఇయ్యకుంటే సివిల్ సప్లై శాఖతోనే విజిలెన్స్ శాఖ కానీ దాడులు చేసి కేసులు పెట్టిస్తామని రైస్ మిల్లులను భయపెట్టిస్తున్నాయి ధాన్యం బదులు నగదు కోసం పట్టుబడుతున్నాయి… 35 లక్షల మెట్రిక్ టన్నులకు కనీసం 200 చొప్పున అదనంగా వసులు చేసి 700 కోట్ల రూపాయలను మిల్లర్ల నుంచి వసూలు చేశాయి ధాన్యం కొనుగోలు కోసం టెండర్లు వేసిన ఈ సంస్థలు డబ్బులు ఎట్లా వసూలు చేస్తున్నాయి మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేసే అధికారం ప్రైవేటు సంస్థలకు ఎవరు కట్టబెట్టారు మే 23 నాటికి నాలుగు సంస్థలకు వచ్చిన గడువు ముగిసిన తర్వాత… ధాన్యం సేకరించి మిల్లులను ఖాళీ చేయాలి… డెడ్లైన్ అయిపోయిన తర్వాత నిబంధనలు ప్రకారం ఆ సంస్థల పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఆ సంస్థలను బ్లాక్లిస్టులో పెట్టకుండా… తమ డబ్బుల కోసం వారికి మరింత గడువు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఈ సంస్థలకు మరింత గడువు ఇస్తే సివిల్ సప్లై కార్పొరేషన్ కి 150 కోట్ల రూపాయల వడ్డీ నష్టం ప్రతినెల వస్తుంది ఇప్పటిదాకా ఎంత ధాన్యం ఆ సంస్థలో లిఫ్ట్ చేశాయో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం చెప్పాలి వారికి గడువు పెంపు ఎందుకు చేస్తున్నారో చెప్పాలి గత ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసిన సంస్థను ఈ ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇచ్చిందో చెప్పాలి ఇందులో వందల కోట్ల రూపాయలు మీకు ముట్టిన విషయంలో కూడా రాష్ట్ర ప్రజలకు స్పష్టతను ఇవ్వాలి పేద విద్యార్థుల కోసం మానవీయ కోణంలో మా ప్రభుత్వం సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించింది దీన్ని కూడా అవినీతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం సేకరించాల్సిన 2.20 లక్షల సన్న బియ్యం కొనుగోలు లో 300 కోట్ల రూపాయల అవినీతికి తెరలేపింది రాష్ట్రంలో 35 రూపాయలకు కొత్త సన్నబియ్యం అందుబాటులో ఉంటే 57 రూపాయలకు కిలో చొప్పున కొంటుంది సన్న బియ్యం కొనుగోలుకు కూడా గ్లోబల్ టెండర్ అనే కుట్రకు లేపింది ధాన్యం సేకరణలో కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టిన అవే నాలుగు కంపెనీలకు బియ్యం కొనుగోలును అవే సంస్థలకు కట్టబెట్టింది నాలుగు సంస్థలు దాదాపు ఒకే ధరకు టెండర్ వేసినవి అంటే… ఇది రింగు కాకపోవడం కాక మరేమిటి అని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం గతంలో సేకరించిన ధాన్యంలో లక్ష అరవై వేల టన్నుల సన్న బియ్యం ధాన్యం అందుబాటులో ఉన్నా… దాని 22 రూపాయలకు అమ్మివేసింది గతంలో మా ప్రభుత్వ మాదిరి ఈ ధాన్యంలో రైస్ మిల్లర్లకు ఇచ్చి బియ్యం సేకరిస్తే కేవలం 35 రూపాయలకు కిలో నాణ్యమైన సన్న బియ్యం వచ్చేది ధాన్యంలో తక్కువకు అమ్మి…. 15 రూపాయలు అదనంగా కిలోకి సన్న బియ్యం కొనుగోలు చేసింది ఇది కేవలం అవినీతి కోసం చేసిన చర్య కాకుంటే ఇంకేమిటి… మొత్తంగా ఈ రెండు స్కాంల రూపంలో మొత్తం 1100 కోట్ల రూపాయల స్కామ్ కి తెరలేపింది
ఈ మొత్తం వ్యవహారంలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా ఉండే అవకాశం ఉంది… ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఆదేశాలు అనుమతి లేకుండా ఏమీ జరగదు అనే విషయం అందరికీ తెలుసు ఈ స్కాంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ పెద్దలు దాకా అనేకమంది హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తంమవుతున్నాయి ఈ మొత్తం స్కాంలో బిజెపి పాత్ర కూడా అనుమానాస్పదంగా, విచిత్రంగా ఉన్నదని అన్నారు.
రాష్ట్రంలో జరిగే ధాన్యం సేకరణ, కనీసం మద్దతు ధర అమలు, బియ్యం సేకరణ ఇలా అన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధీనంలోనే జరుగుతాయి బిజెపి పార్టీ శాసనసభాపక్ష నేతనే స్వయంగా అవినీతి జరిగిందని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా స్పందించలేదు అంటే ఈ అంశంలో ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం అవుతుంది
ఈ మొత్తం వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున చేస్తున్న డిమాండ్లు….
90 రోజుల టెండర్ గడువు ముగిసిన తర్వాత కూడా ధాన్యం సేకరించని సంస్థల పైన తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పాలి..గత ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ చేసిన సంస్థలను ఈ టెండర్ లో ఎలా అనుమతించారో చెప్పాలి విషయంలో ఈ నాలుగు సంస్థలకు మరోసారి ఎక్స్టెన్షన్ ఎందుకు ఇస్తున్నారో చెప్పాలి ఈ టెండర్లను రద్దుచేసి ఆ సంస్థలపైన కఠిన చర్యలు తీసుకోవాలి ధాన్యం సేకరించాల్సిన ఈ నాలుగు సంస్థలు డబ్బులు వసూలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదో చెప్పాలి ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్సిఐ సంస్థ ఎందుకు స్పందించడం లేదు… ఎఫ్సీఐ కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థల (ED , CBI, vigilance) విచారణ కోసం ఆదేశించాలని కోరాలి లేకుంటే ఈ మొత్తం కుంభకోణంలో బిజెపికి కూడా పాత్ర ఉందని భావించాల్సి వస్తుంది గతంలో అన్ని అనవసరమైన విషయాలపైన అడ్డగోలుగా నోరు పారేసుకున్న రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే… ఈ రెండు టెండర్ల వ్యవహారంలో సిట్టింగ్ జడ్జ్ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నా ఈ అంశంలో చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాలి ఈ వ్యవహారంలో కేంద్రం… ఎఫ్సీఐ.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టము… న్యాయపరంగా కేసులు వేసి దోషులను ప్రజల ముందు నిలబెడతాం తప్పకుండా ఆధారాలతో సహా వీళ్ళందరిని కోర్టులతోపాటు ప్రజా కోర్టులోను ఎండగడతం అని కేటీఆర్ అన్నారు.