Harish Rao Resignation Letter
శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీ తో పాటు ఆరు గ్యారంటీల్లోని మొత్తం పదమూడు హామీలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆగస్టు పదిహేనున అమలు చేస్తే , నేను నా శాసనసభ్యత్వానికి అదే రోజు రాజీనామా చేస్తానని ఆమోదం తెలపాలని స్పీకర్ కి హరీష్ రావు రాజీనామా పత్రం ఇచ్చి సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరిరారు లేఖలోని సారాంశం
గౌరవనీయులైన సభాపతి
తెలంగాణ శాసనసభ ,
హైదరాబాద్
గారికి నమస్కారాలు
విషయము : శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ హామీ తో పాటు ఆరు గ్యారంటీల్లోని మొత్తం పదమూడు హామీలు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆగస్టు పదిహేనున అమలు చేస్తే , నేను నా శాసనసభ్యత్వానికి అదే రోజు రాజీనామా చేసినట్టు పరిగణించి ఆమోదం తెలపాలని కోరడం గురించి
ఆర్యా
2023 లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల రూపంలో ప్రజలకు 13 హామీలు ఇచ్చింది . ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే వీటిని అమలు చేస్తామని హామీ ఇచ్చింది . ఇవి కాకుండా 2023 డిసెంబర్ 9 నాడు రైతులకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కూడా చేస్తామని హామీ ఇచ్చింది . రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 140 రోజులు దాటినా మహాలక్ష్మి పేరిట ప్రతి నెలకు 18 యేండ్లు దాటిన వారందరికీ రూ 2500 చొప్పున ఇస్తామన్న హామీ నేర వేర లేదు రైతు భరోసా కింద రైతులకు కౌలు రైతులకు ఎకరాకు రూ 15 పదిహేను వేల రూపాయల చొప్పున , రైతు కూలీలకు ఏటా 12 వేల రూపాయల చొప్పున చెల్లించడం , పంటలకు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల బోనస్ చెల్లించడమనే హామీలు నెరవేరలేదు . ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షల రూపాయలివ్వడం , ఉద్యమ కారులకు 250 చదరపు గజాల స్థలం ఇవ్వడం ఆచరణకు నోచుకోలేదు .యువ వికాసం కింద 5 లక్షల రూపాయల విలువైన విద్యా భరోసా కార్డు ఇస్తామని , ప్రతి మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదు చేయూత కింద ఇచ్చిన హామీ అయిన ఆసరా పెన్షన్ల ను 2 వేల రూపాయల నుంచి 4 వేల రూపాయలకు పెంచడం కూడా అమలు కాలేదు .2 లక్షల రుణ మాఫీ హామీని ఆగస్టు పదిహేను లోపు అమలు చేస్తానని దేవుడి పై వొట్లు తింటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ హామీ తో పాటు వందరోజుల్లో పూర్తి చేస్తామని చేయలేని గ్యారెంటీలను కూడా ఆ రోజు లోగా నెరవేర్చాలని డిమాండ్ చేశాను . ఆగస్టు పదిహేను లోగా నెరవేర్చక పోతే సీఎం రాజీనామా చేయాలని నెరవేరిస్తే నేను రాజీనామా చేస్తానని సవాల్ విసిరాను నా సవాల్ కు కట్టుబడి నేను ఈ రాజీనామా ప్రతిపాదన లేఖను మీ ముందు ఉంచుతున్నాను . 2024 ఆగస్టు 15 లోగా పైన పేర్కొన్న హామీలన్నింటినీ అమలు చేసిన పక్షంలో ఈ లేఖను నా రాజీనామాగా పరిగణించి ఆమోదించాలని కోరుతున్నాను