Sun Risers Hyderabad ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ సరికొత్త రికార్డ్
ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది.రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మీద 287 రన్స్ పరుగులు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.ఇప్పటికే అత్యధిక స్కోరు 277 పరుగులు సాధించి రికార్డ్ క్రియేట్ చేయగా తమ రికార్డ్ ఎవరు బద్దలు చేయలేరంటూ 287 పరుగులు చేసి ఆశ్చర్యపరిచింది.
ఆర్సీబీ పై జరిగిన మ్యాచ్ లో మూడు వికెట్లు కోల్పోయి 287 పరుగులు సాధించింది.చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో హెడ్ 102 పరుగులు సాధించాడు.ఈ సీజన్ లో ముంబై మీద 277 పరుగులు చేసిన సన్ రైజర్స్ మళ్ళీ తాజాగా 287 పరుగులు సాధించి తమకు ఎవరు సాటిలేరని తేల్చిచెప్పింది.
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోతుంది.రెండు టీమ్స్ కలిపి 549 పరుగులు చేసాయి.మొత్తం 38 సిక్సర్లు,43 ఫోర్లు నమోదయ్యాయి.సన్ రైజర్స్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 287 పరుగులు,రాయల్ ఛాలెంజ్ బెంగుళూరు 7 వికెట్లు కోల్పోయి 262 పరుగులు సాధించింది.
సన్ రైజర్స్ జట్టు ఏకంగా 22 సిక్సులు బాదింది.హెడ్ 41 బంతుల్లో 9 ఫోర్లు,8 సిక్సర్లతో 102 పరుగులు చేసాడు.క్లాసెన్ 31 బంతుల్లో 2 ఫోర్లు,7 సిక్సులతో 67 పరుగులు, అబ్దుల్ సమద్ 10 బంతుల్లో 3 సిక్సులు,4 ఫోర్లతో 37పరుగులు నాటౌట్ గా నిలిచాడు.బెంగుళూరు కూడా ఈ స్కోర్ ను చూసి ఏమాత్రం తడుముకోలేదు 262 పరుగులు చేసి 25 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది దినేష్ కార్తీక్ 35 బంతుల్లో 7 సిక్సులు,5 ఫోర్లతో 83 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు.ఛేజింగ్ లో 250 పైగా పరుగులు చేసిన తొలి ఐపీఎల్ జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు నిలిచింది