HCA Summer Camp హెచ్‌సీఏ సమ్మర్ క్యాంప్స్ షెడ్యూల్ విడుదల
15వ తేదీ నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ ప్రారంభం
18వ తేదీ లాస్ట్ డేట్
మొత్తం 27 సెంటర్లలో క్యాంప్స్
ఈనెల 20 నుంచి 30 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ
క్రికెటర్లకు ఉచిత శిక్షణతో పాటు పౌష్ఠికాహారం
జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు కార్యచరణ ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రతి జిల్లాకు రూ.15 లక్షలు చొప్పన ఉమ్మడి తొమ్మిది జిల్లాలకు నిధులు విడుదల చేశారు. తాజాగా సమ్మర్ క్యాంప్స్ షెడ్యూల్, విధివిధానాలను జగన్మోహన్ రావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఏ కార్యదర్శి దేవ్‌రాజ్, ఉపాధ్యక్షుడు దల్జిత్ సింగ్, కోశాధికారి సీజే శ్రీనివాస్, సహాయ కార్యదర్శి బసవరాజు, కౌన్సిలర్ సునిల్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి జిల్లాల్లో మూడు ప్రదేశాల్లో వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించనున్నామని, ప్రతి క్యాంప్‌లో 80 నుంచి 100 మంది పిల్లలకు అవకాశమిస్తున్నామని చెప్పారు. బాలురకు అండర్- 14, 16, 19, బాలికలకు అండర్-15, అండర్-19 వయో విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నామని జగన్మోహన్ రావు తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. ఆసక్తి గల వారు ఈనెల 18వ తేదీ (వచ్చే గురువారం) సాయంత్రం 6 గంటల లోపు ఆన్లైన్లో తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సోమవారం నుంచి శనివారం వరకు, ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు శిక్షణ శిబిరాలను నిర్వహిస్తాం. ఈ సమ్మర్ క్యాంప్స్ను ఉచితంగా నిర్వహిస్తున్నాం. ఎవరికి ఎలాంటి రుసుం చెల్లించాల్సినవసరం లేదని జగన్మోహన్ రావు స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం హెచ్‌సీఏ అధికారిక వెబ్సైట్ (http://www.hycricket.org)ను సందర్శించి, తెలుసుకోవచ్చు.
కేంద్రాల వివరాలు:
హైదరాబాద్:
జింఖానా: 90301 30346
ఫలక్నామా: 98852 95387
అంబర్‌పేట: 98665 82836
లాలాపేట: 99664 62667
మాదాపూర్: 80195 35679
…………………………………..
వరంగల్: 98495 70979
ములుగు: 90301 30727
మహబూబాబాద్: 98664 79666
భూపాలపల్లి: 88978 05683
మహబూబ్‌నగర్: 94400 57849
గద్వాల్: 98859 55633
నాగర్ కర్నూల్: 98854 01701
సంగారెడ్డి: 94408 47360
సిద్ధిపేట: 98499 55478
మెదక్: 99663 62433
నిజామాబాద్: 98490 73809
కామారెడ్డి: 96666 77786
ఆర్మూర్: 96405 73060
కరీంనగర్: 80087 29397
గోదావరి ఖని: 98663 51620
సిరిసిల్ల: 94943 62362
ఖమ్మం: 98486 62125
కొత్తగూడెం: 97050 07555
గౌతమ్‌పూర్: 99482 21777
మంచిర్యాల: 94400 10696
ఆదిలాబాద్: 94402 07473
సిర్పూర్: 94923 33333