Uppal Stadium:హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి పవర్ కట్..

మరికొద్ది గంటల్లో ఉప్పల్ వేదికగా హైదరాబాద్-చెన్నై ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది అయితే ఈ మ్యాచ్ కి సంబందించి విద్యుత్ శాఖ అదికారులు షాక్ ఇచ్చారు.కొన్ని నెలలుగా బిల్లులు చెల్లించని స్టేడియం నిర్వాహకులు దీంతో స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపివేసారు.

2015 లో సబ్ మీటర్ పెట్టీ HCA అక్రమంగా కరెంట్ ను వాడుకుందని అక్రమంగా వాడుకున్న కరెంట్ వాల్యూ కోటి 67 లక్షలు ఉంటుందని SE రాములు చెబుతున్నారు.దీనికి సంబంధించి ఇన్ని రోజులు కేస్ కోర్టు పరిధిలో ఉంది కావున తాజాగా కోర్టు డిపార్ట్మెంట్ కి అనుగుణంగా తీర్పు ఇచ్చింది.అందుకే స్టేడియానికి పవర్ సప్లై కట్ చేశామని సూపరింటెండింగ్ ఇంజనీర్ ( SE) రాములు తెలిపారు.ఇప్పటి వరకు HCA నుంచి మమ్మల్ని ఎవ్వరు సంప్రదించలేదని SE రాములు తెలిపారు.ఉప్పల్ స్టేడియం నిర్వాహకులపై విద్యుత్ చౌర్యం కేసు నమోదుబిల్లులు చెల్లించకుండా రూ.1.67 కోట్లు విద్యుత్ వాడుకున్నారన్న విద్యుత్ శాఖ2015లో కేసు నమోదు 15 రోజులక్రితం నోటీసులు పంపించామని హబ్సిగూడ ఎస్.ఈ రాముడు తెలిపారు.

కాగా ఉప్పల్ వేదికగా హైదరాబాద్-చెన్నై మ్యాచ్ కి విద్యుత్ శాఖ అడిగిన పాసులు ఇవ్వక పోవడంతో పవర్ కట్ చేసారు అని HCA వర్గాలు ఆరోపిస్తున్నాయి.స్టేడియంకు క‌రెంట్‌ స‌ర‌ఫ‌రా నిలిపేసిన విద్యుత్ శాఖ‌ అధికారులు.విద్యుత్ బిల్లుల పెండింగ్ బ‌కాయిలున్నాయ‌ని చెబుతున్న అధికారులు ప్ర‌స్తుతం జ‌న‌రేట‌ర్ల పైనే ఆధారప‌డి న‌డిపిస్తున్న వైనం మ్యాచ్ నిర్వ‌హ‌ణ‌పై ఆందోళ‌న‌ వ్యక్తం చేస్తున్న HCA నిర్వాహకులు.

uppal stadium

కాగా మార్చి 27 న జరిగిన సన్ రైజర్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ కి ముందు రోజే విద్యుత్ సరఫరా బంద్ చేస్తాం అని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు మ్యాచ్ అయిపోయాక బిల్లు చెల్లిస్తాం అన్నందుకు సన్ రైజర్స్, ముంబై మ్యాచ్ కు విద్యుత్ సరఫరా కొనసాగించారు.ఈ సారి బిల్లు చెల్లించే వరకు సరఫరా పునరుద్ధరించడం కుదరదు అని ఖరాఖండిగా చెబుతున్న విద్యుత్ శాఖ అధికారులు..మరికొద్ది గంటల్లో ఉప్పల్ వేదికగా హైదరాబాద్-చెన్నై ఐపీఎల్ మ్యాచ్ పై సందిగ్ధత నెలకొంది.

ఉప్పల్ స్టేడియంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరించిన విద్యుత్ శాఖ.ఐపీఎల్ మ్యాచ్ కి తొలగిన ఇబ్బందిహైదరాబాద్, చెన్నై ఐపీఎల్ మ్యాచ్ యధాతధంగా కొనసాగనున్నది.మ్యాచ్ దృష్ట్యా క్రికెట్ అభిమానులు నిరుత్సాహం చెందొద్దని బిల్లు చెల్లింపుకు రేపు ఒక్క రోజు సమయం ఇచ్చిన విద్యుత్ శాఖ..

Share