MLC Kavitha : ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు లో ఎమ్మెల్సీ కవిత తరపున వాదనల అనంతరం ఉత్తర్వులు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి.ఈనెల 8న (సోమవారం) ఉదయం 10:30గం.లకు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తుది ఉత్తర్వులు ఇవ్వనున్న సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజ.మధ్యంతర బెయిల్ పై
వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వీ ఈ సందర్బంగా సంజయ్ సింగ్ జడ్జిమెంట్ ను కోర్టులో లేవనెత్తిన అభిషేక్ మను సింఘ్వీ కుమారుడికి పరీక్షలు ఉన్నాయి..అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నామని పేర్కోన్నారు.పరీక్షల సమయంలో తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలి.ప్రధాని మోడీ చాలా సందర్భాలలో పిల్లల పరీక్షల సన్నద్ధత పై లెక్చర్ ఇచ్చారుని గుర్తు చేసారు.
పరీక్షల సమయంలో పిలల్లకు తల్లి మద్దతు ఉండాలి.తల్లి అరెస్ట్,పరీక్షల నిర్వహణ పిల్లోడి పై ప్రభావం ఉంటుంది.తండ్రి ఉన్నాడు కానీ న్యాయ పోరాటంలో ఉన్నాడు.పీఎంఎల్ఏ సెక్షన్ 45,మహిళ గా,కవిత కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరిన సింఘ్వి.ఏప్రిల్ 16 వరకు కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయికవిత కుమారుడి పరీక్షల షెడ్యూల్ కోర్టుకు తెలిపిన సింఘ్వి కవిత తన కుమారుడికి మద్దతుగా ఉండేందుకు బెయిల్ ఇవ్వాలని కవిత అరెస్ట్ తో కుమారుడు మానసికంగా కుంగిపోయాడని పరీక్షలకు గైర్హాజరయ్యే అవకాశం ఉందని పరీక్షల సందర్భంగా తల్లి మద్దతు పిల్లలకు అవసరం ఉందని వాదనలు వినిపించారు.తండ్రి తల్లి పాత్రను భర్తీ చేయలేరు ప్రధాని మోడీ పరీక్ష పె చర్చ నిర్వహిస్తున్నారు.మహిళలకు బెయిల్ ఇచ్చిన కేసుల వివరాలను కోర్టులో ప్రస్తావించిన సింఘ్వి ప్రీతి చంద్రా కేసు,సౌమ్య చౌరసియా కేసులను ప్రస్తావించిన అభిషేక్ మను సింగ్వి షరతులతో కూడిన బెయిల్ కు తమకు అభ్యంతరం లేదని తెలిపారు.
కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ముగిసిన ఈడి వాదనల అనంతరం ఉత్తర్వులు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి.ఈనెల 8న (సోమవారం) ఉదయం 10:30గం.లకు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తుది ఉత్తర్వులు ఇవ్వనున్న సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజ.సాధారణ బెయిల్‌పై విచారణ ఏప్రిల్ 20కు వాయిదా.