తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజులు జరగనున్నాయి ఈమేరకు బీఏసి లో నిర్ణయం తీసుకున్నారు.మొదటిరోజు 8 ఫిబ్రవరి న గవర్నర్ ప్రసంగం ఉండగా రేపు అనగా శుక్రవారం నాడు గవర్నర్ కి సభ్యులు ధన్యవాదాలు తెలుపుతారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వరుసగా 10న బడ్జెట్ ప్రవేశపెడతారు 11 సెలవు ఉంటుంది.12 న బడ్జెట్ పై చర్చ జరుపుతారు 13వ తేదీన బడ్జెట్ కి ఆమోదం తెలిపి సమావేశాలు ముగించాలని బిఎసి సమావేశాల్లో నిర్ణయం తీసుకున్నారు.బీఏసీ సమావేశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,సీఎం రేవంత్ రెడ్డి తో పాటు ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు