ktr

KTR: బీఆర్ఎస్ నేతల పార్టీ మార్పులపై ఘాటుగా స్పందించిన కేటీఆర్

తెలంగాణ రాజకీయాల్లో రోజురోజుకు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.పదేళ్లు తెలంగాణలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.ఇప్పటికే కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ,కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు.సిట్టింగ్ ఎంపీలు మెదలు,ఎమ్మెల్యేలు సైతం పార్టీని వీడుతున్నారు.

బీఆర్ఎస్ లో కీలక పదవులు అనుభవించిన కేకే తన కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు.ఇక వరంగల్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్య పోటీ చేయలేను అని కేసిఆర్ కి లేఖ రాసారు.కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని వార్తలు వస్తున్నాయి.ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ నేతల పార్టీ మార్పులపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు.

కేసీఆర్‌ ని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తామని ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు కేటీఆర్. పోరాట పంథాలో కదం తొక్కుదా మని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్.. కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే.. రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారన్నారు .శూన్యం నుండి సునామీ సృష్టించి.. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ అని కొనియాడారు. ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి.. ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలను ఛేదించిన ధీరత్వం కేసీఆర్ దే అన్నారు కేటీఆర్‌.

ఈ సందర్బంగా కేసీఆర్‌ ని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారని కేటీఆర్ అన్నారు.నికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తామని పోరాట పంథాలో కదం తొక్కుదాం అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారని శూన్యం నుండి సునామీ సృష్టించి..అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్నే సాధించిన ధీశాలి కేసీఆర్ అని అన్నారు.ఒక్కడుగా బయలుదేరి లక్షల మంది సైన్యాన్ని తయారు చేసి..అవమానాలు, ద్రోహాలు, కుట్రలు, కుతంత్రాలను ఛేదించిన ధీరత్వం కేసీఆర్ ది అని అన్నారు.ఆలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బ తీయాలనుకునే రాజకీయ బేహారులకు తెలంగాణ ప్రజలే జవాబు చెప్తారుప్రజా ఆశీర్వాదం, మద్దతుతో  14 ఏళ్లు పోరాడి, ఉద్యమ పార్టీగా తెలంగాణ సాధించి.. తెచ్చుకున్న తెలంగాణ దశను, దిశను మార్చి కోట్లాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన KCR గారిని, బీఆర్ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారునికార్సైన కొత్తతరం నాయకత్వం తయారుచేస్తాం, పోరాట పంథాలో కదం తొక్కుదాం అని కార్యకర్తలకు కేటీఆర్ భరోస నింపారు.

Share