Kadiyam Kavya బీఆర్ఎస్ కు కడియం కావ్య షాక్
వరంగల్ లోకసభ స్థానం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకున్న కావ్య
బీఆర్ఎస్ కు కడియం కావ్య షాక్ ఇచ్చింది. మే 13 , 2024 నాడు జరిగే లోకసభ ఎన్నికలలో వరంగల్ లోకసభ స్థానం నుండి భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ రాసింది.గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి , భూకబ్జాలు , ఫోన్ ట్యాపింగ్ లాంటి వ్యవహారాలు మరియు లిక్కర్ స్కాం లాంటి విషయాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని లేఖలో పేర్కోంది.జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం , సహకారం లేకపోవడం , ఎవరికీ వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం చేస్తుందని ఈ పరిస్థితులలో పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని కడియం కావ్య లేఖలో పేర్కొంది.ఈ పరిస్థితులలో పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నానని , కే . సి ఆర్ , మరియు పార్టీ నాయకత్వం , భా . రా . స . కార్యకర్తలు మన్నించ వలసిందిగా కోరుతున్నానని లేఖలో పేర్కొన్న కావ్య.ఈ సందర్బంగా భారత రాష్ట్ర సమితి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన కేసిఆర్ కు కావ్య ధన్యవాదములు తెలిపింది.
కాగా ఇప్పటికే పార్టీలో కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.వరంగల్ లోని కీలక నేతలు ఒక్కోక్కరుగా జారుకుంటున్నారు.ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీలో చేరారు.వరంగల్ లోకసభ అబ్యర్థిగా బీజేపీ నుండి బరిలో ఉన్నారు.సిట్టింగ్ ఎంపీలు పసునూరి దయాకర్,గడ్డం రంజిత్ రెడ్డి,వెంకటేష్ నేత కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.GHMC మేయర్ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలిపారు.సీనియర్ నేత కేకే కూడా బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.కాగా సీనియర్ నేత ఎమ్మెల్యే కడియం కావ్య ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.కడియం కావ్య,కడియం కావ్య పార్టీ మారుతారా బీఆర్ఎస్ లోనే కొనసాగుతారా చూడాల్సి ఉంది.