mlc kavitha

MLC Kavitha తీహార్ జైలుకు ఎమ్మెల్సీ కవిత

ఎమ్మెల్సీ కవిత రిమాండ్ తీహార్ జైలుకు తరలించనున్న అధికారులు

ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన రౌజ్ అవెన్యూ కోర్టు

ఏప్రిల్ 9 వరకు రిమాండ్

కవితను తీహార్ జైలుకు తరలించనున్న అధికారులు

మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1 న విచారణ..

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన రౌజ్ అవెన్యూ కోర్టు.

అయితే అంతకుముందు కవిత మీడియాతో మాట్లాడుతూ కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నారు.ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత రౌజ్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యే ముందు ఈ కేసుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈడీ తనపై నమోదు చేసిన కేసును మనీ లాండరింగ్ కేసు కాదిది, పొలిటికల్ లాండరింగ్ కేసు లాగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ కేసు నుండి కడిగిన ముత్యం లాగా బయటికి వస్తానని అన్నారు.తాత్కాలికంగా జైల్లో పెడతారు కావచ్చు కానీ మా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీయలేరని అన్నారు.ఇది తప్పుడు కేసు, ఇది రాజకీయ కుట్ర లో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని అన్నారు.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తి బీజేపీ లో చేరారని,ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో వ్యక్తి బీజేపీ కూటమి లో పోటీ చేస్తున్నారని అన్నారు.అంతేకాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి బీజేపీ 50 కోట్ల విరాళాలు ఇచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాది సిబిఐ కోర్టులో కోరారు.కవితకు 16 ఏళ్ల కొడుకు ఉన్నాడని, తనకి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యిందని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరిన కవిత న్యాయవాది.అలాగే భర్త, సోదరిని కలిసేందుకు అనుమతి కోరిన కవిత తరపు న్యాయవాదులు దీనికి అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పిన న్యాయమూర్తి..

ఈ కేసులో ఇప్పటికే అటాచ్ చేసిన ఆస్తులను ఖరారు చేస్తూ న్యాయనిర్ణేత అథారిటీ ఉత్తర్వులు ఇచ్చిందన్న ఈడీ న్యాయవాది.PMLA 19 ( 2 ) స్టేట్మెంట్ ఇవ్వాలని కోరిన కవిత తరపు న్యాయవాదులు.అప్లికేషను పెట్టుకోవాలని సూచించిన సిబిఐ న్యాయవాది.

కవిత బెయిల్ పిటిషన్ పై రిప్లై ఇచ్చేందుకు టైం కావాలని అడిగిన ఈడీ అధికారులు.లిక్కర్ కేసు ఇంకా దర్యాప్తు లోనే ఉందని తెలిపిన ఈడీ అధికారులు.15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ కోరిన ఈ డీ.బెయిల్ పై తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి కావేరి భవేజా..

ఈడీ రిక్వెస్ట్ పరిగణలోకి తీసుకొన్న కోర్టు ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధించింది.కవితను తీహార్ జైలుకు తరలించనున్న అధికారులు.మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1 న విచారణ జరగనుంది.

Share