పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
తెలంగాణ లో జరిగే లోక్ సభ ఎన్నికలకు 17 స్థానాలకు గాను 16 స్థానాల్లో అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను నియోజకవర్గాల వారిగా ముఖ్య కార్యకర్తలతో సమావేశమై అందరి అభిప్రాయాలు తీసుకొని అభ్యర్థులను ప్రకటించారు.
ఇందులో నలుగురు సిట్టింగ్ ఎంపీలు కాగా పన్నెండు మంది కి కొత్తవారికి టికెట్ కేటాయించారు.సికింద్రాబాద్ నుండి ఈసారి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ని ఎంపీ గా పోటీ చేస్తున్నారు.అభ్యర్థుల సామాజిక వర్గాల వారిగా చూస్తే బీసీ సామాజికవర్గం ఐదుగురు,రెడ్డి సామాజిక వర్గం నలుగురు,ఎస్సి సామాజిక వర్గం ముగ్గురు,ఖమ్మ సామాజిక వర్గం ఒక్కరు,వెలమ సామాజిక వర్గం ఒక్కరు,ఎస్టీ సామాజిక వర్గం ఇద్దరికి టికెట్లు కేటాయించారు.ఇంకా హైదరాబాద్ ఎంపీ అభ్యర్తితో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నిక కు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ 2024
1)ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు
2) మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత
3) కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్
4 )పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్
5 )మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి
6)చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్
7)వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య
8 )నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్
9 )జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్
10 ) ఆదిలాబాద్(ఎస్టీ ) -ఆత్రం సక్కు
11 )మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి
12)మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి
13 )నాగర్ కర్నూల్ (ఎస్సీ )-ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ .
14) సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్
15.నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి
16.భువనగిరి – క్యామ మల్లేష్..