ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఖండించిన బీఆర్ఎస్ అదినేత కేసిఆర్.ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజని కేసిఆర్ అన్నారు.ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో కేంద్రంలోని అధికార బీజేపీ వ్యవహరిస్తున్నదని ఇటీవల జరిగిన జార్ఖండ్ ముఖమంత్రి హేమంత్ సోరెన్ మరియు బిఆర్ ఎస్ ఎంఎల్సీ కవిత అరెస్టు ఘటనలు రుజువు చేస్తున్నాయని అన్నారు.ఇందుకోసం ఈడీ, సీబీఐ, ఐటీ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం పావులుగా వాడుకుంటున్నదని కేసిఆర్ విమర్శించారు.
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్న బీజేపీ ప్రభుత్వ చర్యలను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నది.కేజ్రీవాల్ అరెస్ట్ రాజకీయ ప్రేరేపిత అరెస్ట్ . అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని, అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు డిమాండ్ చేసారు.
సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు అరవింద్ కేజ్రీవాల్ ను హాజరు పరిచిన ఈడీ అధికారులు.అరవింద్ కేజ్రీవాల్ ను ఈనెల 28 వరకు ఈడి కస్టడీ కి అప్పగిస్తూ స్పెషల్ సిబిఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.6 రోజుల పాటు ఈడి కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.కాగా సీఎం పదవి నుండి అరవింద్ కేజ్రీవాల్ ను తప్పించాలి అంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సామాజికవేత్త ఢిల్లీ వాసి సుర్జీత్ సింగ్ యాదవ్.మనీ లాండరింగ్ కేస్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సీఎం గా ఉండే అర్హత లేదు అంటూ పిల్ లో పేర్కొన్న సుర్జీత్ సింగ్ యాదవ్.అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన జైల్ నుండే పరిపాలన కొనసాగిస్తున్నారన్న అప్ నేతలు ఈ నేపథ్యంలో పిల్ దాఖలు చేసిన సామాజికవేత్త సుర్జీత్ సింగ్ ..