kcr

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేసే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను దశలవారీగా కేసీఆర్ ప్రకటిస్తున్నారు.తాజాగా మరో ఇద్దరిని ప్రకటించారు ఇందులో మెదక్ నుండి వెంకట్రామి రెడ్డి,నాగర్ కర్నూల్ నుండి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ బరిలో నిలువనున్నారు.

ఇదిలా ఉండగా పార్టీలోని కీలక నేతలు పార్టీ మారడం బీఆర్ఎస్ కు కొంత ఇబ్బందికరంగా మారింది ఇప్పటికే పలువురు కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా మరి కొందరు బిజెపి వైపు మళ్లారు. ఈ ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా తమ పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తుండగా అధికార కాంగ్రెస్ మాత్రం 12 నుండి 14 సీట్లు గెలుస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి ధీమాగా చెబుతున్నాడు.మరో వైపు బిజెపి సైతం మోడీ హవా తెలంగాణ లో నడుస్తున్నదని తాము కూడా భారీ విజయావకాశాలు ఉంటాయని ధీమాగా చెబుతున్నారు.

కేసీఆర్ ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థులు
1.ఖమ్మం – నామా నాగేశ్వరరావు
2.మహబూబాబాద్- మాలోత్ కవిత
3.కరీంనగర్- బోయినపల్లి వినోద్ కుమార్
4.పెద్దపల్లి- కొప్పుల ఈశ్వర్
5.మహబూబ్ నగర్- మన్నే శ్రీనివాస్ రెడ్డి
6.చేవెళ్ల-కాసాని జ్ఞానేశ్వర్
7.వరంగల్- కడియం కావ్య
8.జహీరాబాద్- గాలి అనిల్ కుమార్
9.నిజామాబాద్-బాజిరెడ్డి గోవర్ధన్
10.మెదక్- వెంకట్రామి రెడ్డి
11.నాగర్ కర్నూల్ -ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్..
12.మల్కాజిగిరి – రాగిడి లక్ష్మరెడ్డి
13.ఆదిలాబాద్ – ఆత్రం సక్కు

ఇంకా నల్గొండ, భువనగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది..

Share