mlc kavitha

సుప్రీంకోర్టులో కవితకు దక్కని ఊరట

డిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు నిరాశే మిగిల్చిది.ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన కవిత కవితకు సుప్రీంకోర్టులో దక్కని ఊరట.క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన కవితకు ట్రయల్ కోర్టుకే వెళ్లాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.ట్రయల్ కోర్టులోనే బెయిల్ అప్లయ్ చేసుకోవాలని చెప్పిన సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.పీఎంఎల్ఎ కేసులతో ట్యాగ్ చేసిన ధర్మాసనం.మహిళ కాబట్టి ట్రయల్ కోర్టు వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఈడికి నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆరు వారాల్లో ఈడి తమ కౌంటర్ ఫైల్ చేయాలని ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం.

కాగా ఇదే కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది.సోదాల అనంతరం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడి అదికారులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా ఈడీ ఆఫీసులోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.నేడు రౌస్ అవెన్యూ కోర్ట్ లో జడ్జి ముందు కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు హజరు పరుస్తారు.ఉదయం మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నది.అనంతరం గం. 11.00 తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టుకు తరలిస్తారు.స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి కావేరీ బవేజా ఎదుట సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను హాజరుపర్చనున్న ఈడీ అధికారులు.అరవింద్ కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్న ఈడీ.కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఈడీ కార్యాలయం, రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసారు.కేంద్ర పారామిలటరీ బలగాలను రంగంలోకి దించిన ఢిల్లీ పోలీసు యంత్రాంగం.ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించే అవకాశం.కేజ్రీవాల్ అరెస్ట్ ను ఖండించిన పలు పార్టీల నేతలు.జైల్ నుండే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పరిపాలన కొనసాగిస్తారని అప్ నేతల వెల్లడి.

Share