ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అనూహ్యమైన మలుపు చోటు చేసుకుంది.సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది.సోదాల అనంతరం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడి అదికారులు అదుపులోకి తీసుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ ప్రధాన కార్యాలయంకు వెనుక గేట్ నుండి తీసుకువచ్చిన ఈడి అధికారులు.అరెస్ట్ నేపధ్యంలో ఈడీ ప్రధాన కార్యాలయం వద్ద భద్రత కట్టుదిట్టం చేసారు.భారీగా కేంద్ర బలగాలను మోహరించారు.ఈడీ ప్రధాన కార్యాలయం నలువైపులా బారి కేడ్స్ ఏర్పాటు చేసారు.
రాత్రంతా ఈడీ ఆఫీసులోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.నేడు రౌస్ అవెన్యూ కోర్ట్ లో జడ్జి ముందు కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు హజరు పరుస్తారు.ఉదయం మరోసారి వైద్యపరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నది.అనంతరం గం. 11.00 తర్వాత రౌజ్ అవెన్యూ కోర్టుకు తరలిస్తారు.స్పెషల్ సీబీఐ కోర్టు జడ్జి కావేరీ బవేజా ఎదుట సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను హాజరుపర్చనున్న ఈడీ అధికారులు.
అరవింద్ కేజ్రీవాల్ ను 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్న ఈడీ.కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఈడీ కార్యాలయం, రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసారు.కేంద్ర పారామిలటరీ బలగాలను రంగంలోకి దించిన ఢిల్లీ పోలీసు యంత్రాంగం.ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ ధర్నాలు నిర్వహించే అవకాశం.కేజ్రీవాల్ అరెస్ట్ ను ఖండించిన పలు పార్టీల నేతలు.జైల్ నుండే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పరిపాలన కొనసాగిస్తారని అప్ నేతల వెల్లడి.
ఇదే కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరుగనున్నది.ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన కవిత.క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ వేసారు.విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం. త్రివేది .ఇప్పటికే అరెస్టై ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత.ఇదే కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సైతం అరెస్టు చేసిన ఈడీ.