Fake women si

Fake Women Si నకిలీ మహిళ ఎస్సై అరెస్టు

సికింద్రాబాద్ ఆర్.పి.ఎఫ్ ఎస్సై అని చెబుతూ తిరుగుతున్న ఓ యువతిని రైల్వే పోలీసులు అరెస్టు చేసారు.నల్గొండ జిల్లా,నార్కట్ పల్లి కి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసి 2018 లో అర్ పి.ఎఫ్ ఎస్సై పరీక్ష రాసింది.కంటి సమస్య ఉండడంతో వైద్య పరీక్షల్లో ఆమె క్వాలిఫై కాలేదు.

రైల్వే పోలీస్ కావాలన్నది మాళవిక ఆకాంక్ష 2018 లో అర్ పి.ఎఫ్ ఎస్సై పరీక్ష రాసింది.కంటి సమస్య ఉండడంతో వైద్య పరీక్షల్లో ఆమె క్వాలిఫై కాలేదు.కానీ ఈ విషయం గ్రామంలో కానీ తల్లి తండ్రులకు తెలిస్తే భాద పడుతారని గత ఏడాదిగా కాలంగా నకిలీ ఎస్సై గా చెలామణి అవుతున్నది శంకర్ పల్లి లో విధులు నిర్వహిస్తున్నట్లు అందరిని నమ్మించింది మాళవిక.అర్ పి ఎఫ్ ఎస్సై అని చెప్పుకుని యూనిఫాం, ఐ డి కార్డులు తయారు చేసుకున్న మాళవిక ఎస్సై గానే చలామణి అవుతుంది.ఇన్స్టాగ్రాం లో సైతం అర్ పి ఎఫ్ యూనిఫాం లో రీల్స్ చేసిన అందరిని ఆశ్చర్యపడేలా చేసింది.

పెళ్లి సంబంధం చూసేందుకు యూనిఫాం లోనే వెళ్లిన మాళవిక.పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరపు వాళ్ళు ఉన్నతాదికారులను సంప్రదించగా ఈ మోసం బయటపడ్డది దీంతో ఒక్కసారిగా అందరు ఖంగుతిన్నరు.శంకర్ పల్లి లో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించిన మాళవిక.నల్గొండ లో మాళవిక ను పట్టుకున్న పోలీసులు అరెస్ట్ చేసారు

ఇదే విషయంపై రైల్వే పోలిసులు పలు వివరాలు వెల్లడించారు.యూనిఫాం లోనే పెళ్లి సంబంధం చూసేందుకు వెళ్ళడంతో అబ్బాయి తరపు వాళ్ళు ఉన్నతాదికారులను సంప్రదించగా ఈ విషయం బయటపడిందని అన్నారు.ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు రైల్వే పోలిసులు తెలిపారు.

Share