MLC Kavitha

డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో కవిత రిట్ పిటిషన్ దాఖలు చేసారు.తాజా పిటిషన్ లో కీలక అంశాలు పొందుపరిచారు.ఈడి కస్టడీ నుంచి కవితను విడుదల చేయాలని కవిత తరుపు న్యాయవాది పిటిషన్ లో పేర్కొన్నారు.కవిత ఈడి రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో విజ్ఞప్తి చేసారు.

కవిత అరెస్టు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఉల్లంఘించారని చట్ట పరమైన ప్రక్రియ అనుసరించకుండా అరెస్టు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు.కవిత అరెస్టు చట్టబద్ధం కాదు, ఏకపక్షంగా రాజ్యాంగ విరుద్ధంగా ఈడి అధికారులు వ్యవహరించారని పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం మహిళల విషయంలో పాటించాల్సింది నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు.కవిత ఈడి రిమాండ్ ను రద్దు చేయాలని ఈడి కస్టడీ నుంచి కవితను విడుదల చేయాలని పిటిషన్ లో పేర్కొన్న ఎమ్మెల్సీ కవిత తరుపు న్యాయవాది.

తన తల్లీ, పిల్లలను కలుసుకునేందుకు అనుమతించాలని ఎమ్మెల్సీ కవిత అభ్యర్థనను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది.ఈడీ కస్టడీలో ఉండే రోజుల్లో ప్రతీ రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7గంటల వరకు తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు సమ్మతించింది. తల్లి శోభ కుమారులు ఆదిత్య, ఆర్య తోపాటు పలువురు సమీప బంధువులను కలిసేందుకు అనుమతివ్వాలని కవిత కోర్టను కోరగా ఇందుకు రౌస్ అవెన్యూ కోర్టు ఓకే చెబుతూ ఉత్తర్వులు జారీ చేసింది.తాజాగ కవిత అరెస్టు విషయంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ని ఉల్లంఘించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చట్ట పరమైన ప్రక్రియ అనుసరించకుండా అరెస్టు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కవిత అరెస్టు చట్టబద్ధం కాదని.. ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఈడీ అధికారులు వ్యవహరించారని పిటిషన్‌లో వెల్లడించారు. పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలు ఉల్లంఘించినట్లు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు కవిత తరుపు న్యాయవాది.

Share