rs praveen kumar

RS Praveen Kumar బీఆర్ఎస్ లో కీలకపదవిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీ ఆ పార్టీ అదినేత కేసిఆర్ కీలక బాద్యతలు అప్పగించనున్నట్టు కేసిఆర్ కీలక ప్రకటన చేసారు.తెలంగాణ బీఎస్పీ పార్టీకి అద్యక్షునిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేడు తన ముఖ్య అనుచరులతో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

తొలుత తెలంగాణ భవన్ కి చేరుకున్న ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కి బీఆర్ ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.తెలంగాణ భవన్ నుండి నేరుగా గజ్వేల్ లోని బీ.ఆర్ఎ.స్ అధినేత కేసీఆర్ నివాసానికి భారీ ర్యాలీ గా బయలుదేరారు.గజ్వేల్ ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ లో అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.గులాబీ కండువా కప్పి ఆర్ఎస్పీ ని పార్టీలోకి ఆహ్వానించిన అధినేత కేసీఆర్..

ఈ సందర్బంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ బలమైన తెలంగాణ వాదానికి బహుజన వాదం కలిస్తే బాగుంటుందని పొత్తు కుదుర్చుకున్నామని కాని పొత్తు రద్దు చేసుకోమని నా మీద మాయావతి వత్తిడి తెచ్చారని అన్నారు.కానీ కేసీఆర్ మాదిరిగానే కూడా ప్రవీణ్ కుమార్ కూడా మడమ తిప్పడు అని మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉండాలి అని పార్టీలో జాయిన్ కావడానికి నిర్ణయం తీసుకున్న అని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి నీది పాలమూరే నాది పాలమూరే అనుకుంటూనే నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని నేను గొర్రెలమందలో ఒక గొర్రెను కాలేనని మా కార్యకర్తలు ఆర్థికంగా పేదలు కావచ్చు కానీ సైద్ధాంతికంగా పేదలు కాదు నలుమూలలు తిరిగి బహుజన వాదాన్ని ప్రచారం చేస్తామని స్పష్టం చేసారు.కేసీఆర్ నాయకత్వంలో పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. తనను నమ్మి ప్రయాణిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు.ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని తెలంగాణవాదం, బహుజనవాదం ఒక్కటేనని అన్నారు.

చితికిపోయిన తెలంగాణకు కేసీఆర్ విముక్తి కల్పించారు.అణిచివేత కామన్.. విముక్తి లక్ష్యం.గత పదేండ్లు స్వర్ణ యుగం కేసీఆర్ అధికారంలో లేకపోవడం దురదృష్టకరం అని అన్నారు.నేను ఏదీ ఆశించిరాలేదు‌‌‌.. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్యామ్యం కోసమే వచ్చాను నేను కూడా పాలమూరు బిడ్డనే.. ఓ వైపు నన్ను సీఎం పొగుడుతూనే మరోవైపు వార్నింగ్ ఇస్తున్నాడు నాకు టీఎస్‌పీఎస్సీ ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే.. నేను తిరస్కరించాను‌.. ఎవరు ఎక్కడైనా పని చేసుకునే స్వేచ్చ ఉంది ..మీరు గేట్లు తెరిస్తే చేరుతున్న గొర్రెల మందలో ఒక్కన్ని కాలేను అని స్పష్టం చేసారు.

ఈ ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీ ఆ పార్టీ అదినేత కేసిఆర్ కీలక బాద్యతలు అప్పజెపుతానని తెలిపారు.బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రవీణ్ ను త్వరలోనే ప్రకటిస్తా భవిషత్తులో కూడా ఉన్నత స్థానం లో వుంటాడని కేసిఆర్ స్పష్టం చేసారు.మంచి ఆశయం కోసం పనిచేసిన మీకు రాజకీయ సామాజిక ఫలితాలుంటాయని ఆచరణయోగ్యమైన కార్యాచన తో ప్రజల్లో కలిసి పానిక్ చేద్దాం,ఫలితాలు సాధిద్దాం.దళిత శక్తినీ ఏకం చేసేందుకు బలహీన వర్గాలను ఐక్యం చేసేందుకు మనం నడుం కడుదాం,కలిసి ఎజెండా తయారు చేద్దాం,తెలంగాణ ఉద్యమసమయంలో కూడా నిరుత్సాహపరిచిండ్రు కానీ వెనక్కుపోలె ఇప్పుడు కూడా అంతే ముందుకు పోదాం కన్విక్షన్ ఉంటే అసాధ్యం ఏమి వుండదు అని కేసిఆర్ అన్నారు.

Share