Loksabha Election Schedule 2024 లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ 2024
2024 లోక్ సభ ఎన్నికలకు నగరా మోగింది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎప్రిల్ 19న ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తం 7 దశల్లో దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. 47 రోజుల్లో ఎన్నికల ప్రక్రియంగా పూర్తై జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎలెక్షన్ నోటిఫికేషన్‌ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సీఈసీ రాజీవ్ కుమార్ పూర్తి షెడ్యూల్‌ని విడుదల చేశారు. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఎన్నికల తేదీలు ప్రకటించారు. 7 విడతల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19 న ఎన్నికల ప్రక్రియ మొదలు కానుంది. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనుంది.
ఏప్రిల్ 19న తొలి విడత లోక్‌సభ పోలింగ్ మొదలవుతుంది. ఏప్రిల్ 26న రెండో దశ ఎన్నికలు జరుగుతాయి. మే7వ తేదీన మూడో దశ, మే 13 న నాలుగో దశ పోలింగ్ జరుగుతుందని ఈసీ స్పష్టం చేసింది. మే 20న ఐదో దశ, మే 25న ఆరో దశ, జూన్ 1వ తేదీన ఏడో దశ పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఒకేసారి ఫలితాలు విడుదలవుతాయి .తెలంగాణలో మొత్తం 17లోకసభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో నిర్వహించ నుండగా తెలంగాణలో నాలుగో విడత పోలింగ్ జరగనుందని ఆయన వెల్లడించారు. నాలుగో విడుతలో మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనున్నది. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. 13న ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని ఈసీ వివరించింది.అరుణాచల్ ప్రదేశ్‌లో మొత్తం 60 అసెంబ్లీ నియోజకవర్గాలు, 2 లోక్‌సభ సీట్లున్నాయి. ఇక్కడ ఏప్రిల్ 19న ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక సిక్కిం విషయానికొస్తే ఏప్రిల్ 19వ తేదీన మొత్తం 32 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఒడిశాలో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన తొలి విడత, మే 20న మలి విడత పోలింగ్ జరగనుంది. ఏపీలో ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి.
దేశవ్యాప్తంగా 97 కోట్ల ఓటర్లు రిజిస్టర్ అయ్యారని ఈసీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. దాదాపు కోటిన్నర మంది పోలింగ్ అధికారులు ఎన్నికల ప్రక్రియని పరిశీలించనున్నారు. పటిష్టమైన సెక్యూరిటీ కోసం భారీగా స్టాఫ్‌నీ నియమించనున్నారు. 55 లక్షల ఈవీఎమ్‌లు, 4 లక్షల వాహనాలు సిద్ధం చేశామని సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఇక ఈఎన్నికల్లో ఓటర్ల జాబితాను పరిశీలిస్తే.. దాదాపు 12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. తొలిసారి ఓటు వేసే వారి సంఖ్య కోటి 80 లక్షల వరకూ ఉంది. 85 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే వెసులుబాటు కల్పించింది ఈసీ .పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్ల కోసం తగిన సదుపాయాలు సమకూర్చనున్నట్టు ఈసీ ప్రకటించింది. తాగునీరు, టాయిలెట్స్, దివ్యాంగుల కోసం ర్యాంప్ లేదా వీల్‌ఛైర్‌లు,హెల్ప్ డెస్క్, ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.