rs praveen kumar

బీఎస్పీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆయన భేటీ అయ్యారు. రాజీనామాకు సంబందించి బహుజనులకు ఆర్ఎస్ ప్రవీణ్‌ ట్వీట్ చేశారు. భారమైన హృదయంతో బీఎస్పీని వీడుతున్నట్టు ప్రకటించారు. తప్పనిసరి పరిస్థితిలో విధిలేకనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. బీఎస్పీ- బీఆర్ఎస్ పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆర్‌ఎస్ ప్రవీణ్‌ ఫైర్ అయ్యారు.ఎన్నికల షెడ్యూల్ కు కొన్ని గంటల ముందు కవిత అరెస్ట్ అందులో భాగమేనన్నారు.

పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందేనని తేల్చిచెప్పారు ఇదే తాను నమ్మిన నిజమైన ధర్మమని ఆర్ఎస్ ప్రవీణ్‌ పేర్కొన్నారు. బీజేపీ కుట్రలకు భయపడి నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేని తేల్చిచెప్పారు. స్వేరోస్ అందరూ తన నిర్ణయాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నట్టు చెప్పారు. చివరి వరకు బహుజన వాదాన్ని తన గుండెలో పదిలంగా దాచుకుంటానని ఆర్ఎస్ ప్రవీణ్‌ స్పష్టం చేశారు.

బీఎస్పీకి రాజీనామా చేసిన అనంతరం ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.చాలా బాధతో బీఎస్పి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.మాయావతి ఆశీర్వాదంతో నల్గొండ సభలో బీఎస్పిలో చేరానని అన్నారు.నాలుగు వేల గ్రామాల్లో పర్యటనలు చేశానని అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పి అభ్యర్థిగా నేను పోటీ చేయడమే కాకుండా 107 అభ్యర్థులను బరిలో నిలిపానని అన్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ,కాంగ్రెస్ పార్టీలతో కాకుండా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని అనుకున్నామని అందరితో చర్చించి బిఆర్ఎస్,బీఎస్పీ పొత్తుపై నిర్ణయం తీసుకున్నామని అన్నారు.దేశంలో బీజేపీ గేలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తామని అంటున్నారని అన్నారు.

పొత్తులో బాగంగా మాకు కేసీఆర్ రెండు సీట్లు కేటాయించారు.బీఎస్పి జాతీయ నాయకత్వం సైతం అంగీకరించింది.బిఆర్ఎస్, బీఎస్పి పొత్తు నచ్చని బీజేపీ బీఎస్పిపై ఒత్తిడి తీసుకువచ్చి పొత్తును రద్దు చేశారు.ప్రెస్ మీట్ పెట్టి పొత్తును రద్దు చేస్తున్నట్లు ప్రకటించాలని బీఎస్పి హై కమాండ్ నుండి ఆదేశాలు వచ్చాయని తెలిపారు.నేను ఐ.పి.ఎ.స్ ఆఫీసర్ గా దేశం కోసం పని చేశానని అన్నారు.బీఎస్పి రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన మాయావతికి ధన్యవాదాలు తెలిపారు.ఎన్నటికీ బహుజన వాదాన్ని వీడను అని తెలంగాణ ప్రయోజనాల కోసమే నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.

కేసీఆర్ కు పొత్తుపై మాట ఇచ్చాను అందుకే మాట తప్పను అని అన్నారు.నా శ్రేయోభిలాషులతో చర్చలు జరిపి రాజకీయంగా నిర్ణయం తీసుకుంటాను ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కేసీఆర్ తో చర్చించాను రాబోయే రోజుల్లో కేసీఆర్ తో,బిఆర్ఎస్ పార్టీతో కలిసి పని చేస్తాను అని స్పష్టం చేసిన ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్.

Share