jithender reddy

Jithender Reddy కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి

బీజేపీ సీనియర్ నాయకులు,మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తన కుమారుడితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

పార్టీలో చేరిన మరుక్షణమే జితేందర్ రెడ్డికి కాంగ్రేస్ పార్టీ కీలక భాద్యతలు అప్పగించింది.న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ( క్రీడా వ్యవహారాలు ) నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..

మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డి ఇంటికి స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లి మరి చర్చలు జరిపారు.సుదీర్ఘ రాజకీయ అనుభవము మహబూబ్ నగర్ తో పాటు ఢిల్లీలో కూడా విస్తృత పరిచయాలు ఉండటంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.పాలమూరు జిల్లా వాసులుగా మేం ఒకరి ఇంటికి ఒకరం వెళుతుంటాం మాకు ఇవి సర్వసాదరణమే అని కొట్టిపారేసిన జితేందర్ రెడ్డి నేడు కాంగ్రేస్ పార్టీలో చేరి అందరికి షాక్ ఇచ్చారు..

ఓ వైపు హైదరాబాద్ లో మల్కాజిగిరి లోక్ సభ పరిధిలో ప్రధాని మోదీ రోడ్ షో కొనసాగుతుండగానే జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.గత అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడు మిథున్ రెడ్డి బీజేపీ నుండి పోటీ చేసి ఓటమి చవిచూసాడు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క,మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో పాటు మహబూబ్ నగర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు,పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

Share