mlc kavitha
MLC Kavitha

దేశవ్యాప్తంగా సంచలనం సృంష్టించిన డిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవిత ను ఈడీ అదికారులు అరెస్ట్ చేసారు.కవిత నివాసంలో ఈడీ సోదాలు దాదాపుగా ఐదు గంటలు కొనసాగాయి. కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొన్న అధికారులు.
ఢిల్లీ నుండి వచ్చిన ఈ డీ అధికారులు కవిత రెండు ఫోన్లు సీజ్ చేసారు.మొత్తం 12 మంది అధికారుల బృందం ఇందులో ఇద్దరు మహిళా అధికారులు కూడా ఉన్నారు.అయితే కవిత విచారణకు సుప్రీంకోర్టు ఈ నెల 19 కి వాయిదా వేసింది కాగా నేడు కవిత ను ఈడీ అదికారులు అరెస్ట్ చేసారు కాసేపట్లో ఢిల్లీ కి తరలించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

రాత్రి 8.45 నిమిషాలకు ఈ డీ అధికారులు ఢిల్లీకి ఫ్లైట్ బుక్ చేశారు.సెర్చింగ్ వారెంట్ తో పాటూ అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేశారు.అయితే వారెంట్లతో పాటు ఫ్లైట్ టికెట్ ముందే బుక్ చేశారు.

అరెస్ట్ నేపథ్యంలో కవిత ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది.కేటీఆర్, హరీష్ రావు కవిత ఇంటికి చేరుకున్నారు. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీగా చేరుకున్నారు.

ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని సుప్రీంకోర్టు లో కేసు అండర్ టేకింగ్ లో ఉండగా ఎలా అరెస్ట్ చేస్తారు అంటూ హరీష్ రావు ,కేటీఆర్ ఈ డీ అధికారులతో వాగ్వాదానికి దిగారు.

Share