Yadadri Peetala Issue యాదాద్రి పీటల వివాదం పై అధికారుల అలెర్ట్
యాదగిరిగుట్ట ఆలయంలో జరిగిన పీటల వివాదం పై అధికారుల అలెర్ట్ అయ్యారు.ఇటీవల ఆలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మహిళా మంత్రి కొండా సురేఖకు చిన్న పీటలు వేసి అవమానించారని వివాదాస్పదంగా మారిన ఘటనతో అధికారులు తమ తప్పు దిద్దుకునే పనిలో పడ్డారు.
ప్రతిపక్షాలకు పీటల వివాదం ఆయుధంగా మారడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యాదగిరిగుట్ట దేవస్థాన అధికారుల అప్రమత్తం అయ్యీరు ఇందులో బాగంగా పది సమాంతర పీటలు కొనుగోలు చేసారు.ప్రత్యేక పూజల అనంతరం ఈ పీటలను అధికారులు అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం.
పాత పీటలు 4,కొత్తవి 10 పీటలతో సహా ఒకేసారి 14 మంది వీవీఐపీలకు వేద ఆశీర్వచనం చేసేలా దేవస్థాన అధికారులు చర్యలు చేపట్టారు.ఇప్పటికే పీటల వివాదంపై తన మీద జరుగుతున్న ట్రోలింగ్ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు తన మొక్కు కారణంగానే కావాలనే దేవుని మీద భక్తితో చిన్న పీట మీద కూర్చున్నట్టు వివరణ ఇచ్చారు.అయితే భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా యాదగిరిగుట్ట ఆలయఅధికారులు తమ తప్పు దిద్దుకునే పనిలో పడడంతో మరోసారి యాదగిరిగుట్ట ఆలయం వార్తల్లోకెక్కింది.