PM Modi

PM Modi రేపు హైదరాబాద్ కు ప్రదాని మోదీ

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది.ఇందులో బాగంగానే రేపు హైదరాబాద్ కు ప్రదాని మోదీ రానున్నారు.పది రోజుల వ్యవధిలో రెండోసారి రాష్ట్రానికి ప్రధాని మోదీ రావడం రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది.

మూడు రోజుల పాటు లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి మోదీ పాల్గొననున్నారు.ఇందులో బాగంగా రేపు సాయంత్రం మల్కాజ్‌గిరిలో ప్రధాని మోదీ భారీ రోడ్ షో లో పాల్గొంటారు.మీర్జాలగూడ నుండి మల్కాజ్‌గిరి వరకు మోదీ రోడ్ షో కొనసాగుతుంది.మోదీ రోడ్ షోకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.మల్కాజ్‌గిరిలో లోక్‌సభ పరిధిలో దాదాపు 1.3కిమీ మేర ప్రధాని రోడ్ షో కొనసాగుతుంది.

మల్కాజిగిరి నుండి సీనియర్ నాయకులు ఈటెల రాజేందర్ పోటీలో ఉన్నారు.

అదేవిదంగా ఈ నెల 16న నాగర్‌కర్నూల్ లో మోదీ బహిరంగ సభ తో పాటు 18న జగిత్యాల బీజేపీ బహిరంగ సభలో ప్రధానమంత్రి పాల్గొని కార్యకర్తలకు,ప్రజలకు తన సందేశం వినిపించనున్నారు.

ఇక బీజేపీ పార్టీ తెలంగాణ లో ఖమ్మం,వరంగల్ మినహ 15 పార్లమెంట్ స్థానాలకు తమ అభ్యర్తులను ప్రకటించింది.ఇందులో సికింద్రాబాద్ నుండి కిషన్ రెడ్డి,హైదరాబాద్ నుండి మాదవిలత,మెదక్ నుండి రఘునందన్ రావు,మహబూబ్ నగర్ నుండి డీ.కే.అరుణ,జహీరాబాద్ నుండి బీబీ పాటిల్,మహబూబాబాద్ నుండి సీతారాంనాయక్,భువనగిరి నుండి బూర నర్సయ్య గౌడ్,నల్గొండ సైదిరెడ్డి,అదిలాబాద్ గోడెం నగేష్,పెద్దపల్లి గోమాస శ్రీనివాస్,చేవేళ్ల కొండా విశ్వేశ్వర్ రెడ్డి,కరీంనగర్ బండి సంజయ్,నాగర్ కర్నూల్ భరత్.

Share