cm revanth reddy, kcr సీఎం రేవంత్ రెడ్డి,మాజీ సీఎం కేసిఆర్ తిట్లదండకం
తెలంగాణ రాజకీయాల్లో భాషపై జనాల్లో విస్తృత చర్చ జరుగుతుంది.గత కొన్ని రోజులుగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మాజీ సీఎం కేసిఆర్ వాడుతున్న భాషపై ఒక్కొక్కరు ఒక్కో విదంగా స్పందిస్తున్నారు.
ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి సీటు అధిరోహించిన రేవంత్ రెడ్డి ఒకవైపు,పదేళ్లు ముఖ్యమంత్రి గా చేసిన కేసీఆర్ ఇద్దరు ఇద్దరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.అయితే ఇందులో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అన్న విదంగా ఏమి లేదు నువ్వు ఒకటి అంటే నేను పది అంటా అన్నట్టు ఇద్దరి వ్యవహరశైలి కొనసాగుతుంది
ప్రెస్మీట్ కావచ్చు లేదా పబ్లిక్ మీటింగ్ కావచ్చు ప్రదానంగా ఒకరి మీద మరొకరు విమర్శల అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు జనం ఎలా రియాక్ట్ అవుతారు అనే ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్న ఇద్దరి వైఖరి పై జనం తప్పుబడుతున్నారు.ఇంట్లో కూర్చొని పిల్లల ముందు ఈ సభలు సమావేశాలు చూడాలంటే చాలు ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది..
ఇందులో ఒకరు అన్ని వర్గాల ప్రజల మద్దతుతో రాష్ట్రం కోసం ఉద్యమం చేసి తెలంగాణ సాధించగా మరొకరు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంభం నుండి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి సీటును కైవసం చేసుకున్న వ్యక్తి మరొకరు.ఇద్దరిని తెలంగాణ ప్రజలు క్షుణ్ణంగా పరిశీలంచే నాయకులు.ప్రజలను తమ మాటల ద్వారా ప్రభావితం చేయగల సమర్థులు.తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగల కార్యదీక్షులు కానీ నేడు వారిరువురు అనుసరిస్తున్న తీరు మాత్రం ప్రజలను ఆలోచింపజేస్తుంది.ప్రజలను ముందుండి నడిపించే నాయకులు తమ ప్రజల బాగోగులను చూసే నాయకులు భాష విషయంలో కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు..
రాబోయే కొత్తతరం రాజకీయ నాయకులకు మార్గదర్శకులుగా ఉండాల్సిన నేతలు రాజకీయంలో ఇలానే ఉంటదా అన్న ఆలోచన వచ్చేలా వ్యవహరిస్తున్నారని వెంటనే ఇలాంటి వికృత రాజకీయాలకు చరమగీతం పాడాలని ప్రజలకు,యువతకు ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నారు..