KCR నలుగురు నేతలు పోతే బిఆర్ఎస్ కు నష్ఠం లేదు-కేసిఆర్
కరీంనగర్ కదన భేరి సభ వేదికగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు.తెలంగాణ ప్రజల ఆశలు అడియాశాలైన పరిస్థితుల్లో తెలంగాణ కోసం జలదృశ్యంలో పార్టీ స్థాపించానని అన్నారు.కరీంనగర్ జిల్లా చైతన్యవంతమైన ప్రాంతం కాబట్టి మే 17 వ తేదీ 2001 లో కరీంనగర్ నుండి సింహ గర్జన సభ జరుపుకున్నామని గుర్తు చేసారు.కరీంనగర్ నుండే తెలంగాణ ఉద్యమ కార్యాచరణ ప్రారంభం అయిందని కేంద్రమంత్రి పదవిని,ఎంపీ పదవిని వదులుకోని కరీంనగర్ నుండి ఉప ఎన్నికల్లో గెలిచానని అన్నారు.కరీంనగర్ తెలంగాణకు అడ్డా అని చెప్పారు.రాజకీయాల్లో అనేక పరిణామాలు జరుగుతుంటాయని కొన్ని సందర్భాల్లో ప్రజలు మోసపోతారని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తులం బంగారం,ఆరు గ్యారెంటీలు అని చెప్పిందని రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతామని రాష్ట్ర మంత్రి చెప్పారని రైతులు రైతు బంధు,కరెంటు అడిగితే ముఖ్యమంత్రి పండబెట్టి తొక్కుతా,మానవ బాంబు అవుతా అని అంటున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
సీఎం పదవిలో ఉండి మానవబాంబు అవుతా అని మాట్లాడుతారా,పేగులు మేడలో వేసుకుంటా అంటారా
ముఖాన పెండ వేసుకుంటా అంటారా,మానవ బాంబులా ,మన్ను బాంబులా నేను తెలంగాణ ఉద్యమంలో మాట్లాడింది తెలంగాణ ద్రోహుల మీద,నేను సీఎం అయ్యాక దురుసు మాటలు మాట్లాడలేదని కేసిఆర్ అన్నారు.
తెలంగాణ వచ్చాక భయంకరమైన పరిస్థితి వుండేది,తెలంగాణ వచ్చాక లంకె బిందెలు కోసం వచ్చామని నేను అన్నానా,ఎవరైనా సీఎం లంకె బిందెలు కోసం వచ్చామని అంటారా,మాతో పోటీ పడి పరిపాలన చెయ్యి కాంగ్రెస్ ప్రభుత్వంపై మాకు ఈర్ష్య లేదు ఇంటింటికి నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని చెప్పా మిషన్ భగీరథ నడిపే సత్తా ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు.ఏడాది కాలంలోనే మేము 24 గంటలు కరెంటు ఇచ్చామని కరోనా కాలంలో సైతం నేను రైతు బంధు ఆపలేదని అన్నారు.
రైతుబంధు ఇచ్చే సత్తా ముఖ్యమంత్రికి లేదు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇచ్చిన హామీలు అమలు చేయరు ఇప్పుడు బిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో అవసరం అని అన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బిఆర్ఎస్ గెలిస్తే తెలంగాణ బాగుపడుతుంది.ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల ఇవ్వాలి కానీ మోడీ తెలంగాణకు ఒక్క పాఠశాల ఇవ్వలేదని అన్నారు.ఒక్క నవోదయ,ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని బీజేపీకి తెలంగాణ ప్రజలు ఎందుకు ఓటు వెయ్యాలి అని ప్రశ్నించారు.
బండి సంజయ్ కు వినోద్ కుమార్ కు పోలిక వుందా మొదటి నుండి తెలంగాణ ఉద్యమంలో వినోద్ కుమార్ క్రియాశీలక పాత్ర పోషించారని కరీంనగర్ స్మార్ట్ సిటీ తెచ్చిన ఘనత వినోద్ కుమార్ కు దక్కిందని అన్నారు.కేసీఆర్ సీఎంగా వున్నప్పుడు ఎకరం పొలం అయినా ఎండిందా…? దేశంలోనే మొదటి సారి రైతుబంధు తెలంగాణలో అమలు చేశామని తెలంగాణలో ఐటీ,పరిశ్రమల అభివృద్ధి జరిగిందని అన్నారు.
కేసీఆర్ సిఎంగా వున్నప్పుడు పచ్చని పొలాలు,24 గంటల కరంటు ఇప్పుడు ఏమైందని కాంగ్రెస్ చెప్పిన బోనస్ బోగస్ అయిందని అన్నారు. కాళేశ్వరం ఎందుకు కట్టామో ప్రజలకు చెప్పామని కాళేశ్వరం ప్రాజెక్టులో ఇసుక జారి రెండు పిల్లర్లు కుంగితే ప్రళయం బద్దలైనట్లు,ప్రపంచం కొట్టుకపోయినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ ను బద్నాం చేయడమే లక్ష్యంగా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 300 పైగా పిల్లర్లు వుంటాయి రెండు పిల్లర్లు కుంగితే భారతదేశం కొట్టుకపోయినట్లు బద్నాం చేస్తున్నారని అన్నారు.త్వరలో టీవీల ముందు కూర్చుని కాళేశ్వరంపై ప్రజలకు చెప్తానని ప్రభుత్వంపై అంకుశం లాగా బిఆర్ఎస్ పార్టీ పని చేయాలని అన్నారు.
డిసెంబర్ 9 వ తేదీన రుణమాఫీ హామీ ఎటు పోయిందని కేసిఆర్ ప్రశ్నించారు.తెలంగాణ బలంగా ఉండాలంటే బిఆర్ఎస్ బలంగా వుండాలని బతుకమ్మ చీరలు తమాషా కోసం తేలేదని చేనేత కార్మికుల కోసం బతుకమ్మ చీరలు తెచ్చామని అన్నారు.తెలంగాణ ఉద్యమంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసి ఏడ్చామని బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయని 24 గంటల ఉచిత కరెంటు రైతులకు ఇచ్చామని అన్నారు.
మూడు నెలల్లోనే పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది.చేనేత కార్మికులు కోసం కొట్లాడాలంటే బిఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో ఉండాలి ఓటు తమాషాకు వేయవద్దు ఢిల్లీకి సూటు కేసులు పంపడంలో ముఖ్యమంత్రి,మంత్రులు బిజీగా వున్నారు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని రాష్ట్రంలో దౌర్జన్యం చేసి కాంగ్రెస్ నేతలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో మళ్లీ బిఆర్ఎస్ గెలిచి వుంటే దేశంలో అగ్గిపెట్టే వాడిని చిన్న దెబ్బ తగిలింది…తట్టుకుంటా నిలబడతా నేను ఏ పధకం తెచ్చినా కులం,మతం చూడలేదని అన్నారు.
పోలీసులు బిఆర్ఎస్ కార్యకర్తలను బెదిరిస్తున్నారు పోలీసులకు రాజకీయాలు ఎందుకు ఎవరికి అధికారం శాశ్వతం కాదు మా మీద కొంతమంది మొరిగారు…అయినా పోలీసులను వాడుకోలేదని అన్నారు.
కాంగ్రెస్,బీజేపీ నేతలకు జై తెలంగాణ అనే ధైర్యం ఉందా గులాబీ జెండానే తెలంగాణకు రక్షణగా ఉంటుంది భూమి,ఆకాశం వున్న రోజులు బిఆర్ఎస్ వుంటుంది కొంతమంది నేతలు వెళ్తే బిఆర్ఎస్ పని అయిపోయిందని అసత్య ప్రచారం చేస్తున్నారు నలుగురు నేతలు పార్టీ మారితే బిఆర్ఎస్ కు ఏం కాదని కేసిఆర్ అన్నారు.