mlc kavitha

MLC Kavitha రిజర్వేషన్ లో మహిళలకు జరుగుతున్న అన్యాయం పై ఈ నెల ఎనిమిదో తేదీన ధర్నా చౌక్ లో నిరసన

ప్రజాప్రతినిధుల విషయమై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము.. ఓటుకు నోటు కేసులో మొదటి ముద్దాయిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేసును కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలి

సోనియాను బలిదేవత అన్న సీఎం ఇవాళ సోనియా, రాహుల్ ను తెలంగాణ నుంచి పోటీకి ఆహ్వానిస్తున్నారని ఎద్దేవా

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం. ప్రభుత్వం కొత్తగా జీవో నంబర్‌-3ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి.

ఈనెల ఎనిమిదో తేదీన మహిళా దినోత్సవం రోజున ధర్నా చౌక్‌లో నల్ల రిబ్బన్లతో ధర్నాలో పాల్గొంటాం

కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై భారత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిదో తేదీన ధర్నా చౌక్ లో నిరసన వ్యక్తం చేయనున్నట్లు కవిత ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలపనున్నట్లు తెలిపారు. మార్చ్ ఎనిమిదో తేదీన జరిగిన ధర్నాకు మిగతా వాళ్లు కూడా కలిసి రావాలని కోరారు. రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఇస్తున్న ఉద్యోగ నియామకాలు అన్నీ కేసీఆర్ చేపట్టినవేనని రేవంత్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్ డీఎస్సీ మాత్రమేనని చెప్పారు. గురుకుల నియామకాలను ఆరోహణా క్రమంలో నింపడం సరికాదని అన్నారు.

33 శాతం రావాల్సిన రిజర్వేషన్ పూర్తిగా వెనక్కి పోయింది. రోస్టర్ విధానంతో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉంది

తన నివాసంలో మీడియాతో కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం కొత్తగా జీవో నంబర్‌-3ను తీసుకొచ్చింది. ఈ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలన్నారు. దీనికి నిరసనగా ఈనెల ఎనిమిదో తేదీన మహిళా దినోత్సవం రోజున ధర్నా చౌక్‌లో నల్ల రిబ్బన్లతో ధర్నాలో పాల్గొంటాం. నిరసన కార్యక్రమాలు చేపడతాం. మహిళలకు, అభ్యర్థులకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. 33 శాతం రావాల్సిన రిజర్వేషన్ పూర్తిగా వెనక్కి పోయింది. రోస్టర్ విధానంతో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు

గురుకులాల ఉద్యోగాల నియామకాల్లో మహిళలకు కేవలం 12 శాతం ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని చాలా మంది మహిళలకు అన్యాయం జరిగినందున జీఓ నంబర్ 3ను తక్షణమే రద్దు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల విషయంలో ఆడబిడ్డలకు అన్యాయం చేయవద్దని గతంలోనే కోరామని, 626 ఉద్యోగాల్లో కేవలం 77 మాత్రమే ఆడబిడ్డలకు వచ్చాయన్నారు. 33 శాతానికి పైగా ఆడబిడ్డలకు ఉద్యోగాలు రావాల్సింది.. పోయి 12 శాతం మాత్రమే వస్తున్నాయని కవిత ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టులో కేసు వేసిందని, మహిళలకు అన్యాయం చేయబోమని కేసీఆర్ అప్పీలుకు వెళ్లారని గుర్తు చేశారు ఎమ్మెల్సీ కవిత.

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వని ప్రధాని పెద్దన్న ఎలా అవుతారు

ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్‌ వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు. 

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి మొదటి ముద్దాయిగా ఉన్నారని, కేసును కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలన్నారు కవిత. సోనియాను బలిదేవత అన్న సీఎం ఇవాళ సోనియా, రాహుల్‌ ను పోటీకి ఆహ్వానిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని గుర్తు పెట్టుకొని ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఓటర్లకు కవిత పిలుపునిచ్చారు.

ఆదిలాబాద్‌ సభలో ప్రధాని మోదీని రేవంత్‌ పెద్దన్న అని సంభోదించారు. దీంతో, బీజేపీ, కాంగ్రెస్‌ ఒక్కటే అని అర్ధం అవుతుంది. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ.. ఎలా పెద్దన్న అవుతాడని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు ఇవ్వకుండా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని కవిత మండిపడ్డారు. పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నీళ్లు ఇచ్చే ఆస్కారం ఉండి ఇవ్వకపోవడం రైతులపై కక్ష సాధింపు మాత్రమేనని కవిత కాంగ్రెస్ సర్కారుపై ధ్వజమెత్తారు. మరోవైపు, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు.

Share