ktr

KTR సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్

తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.సవాళ్లు ప్రతి సవాళ్ళతో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కింది.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీట్ అయినా గెలువు అని సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ కి సవాలు విసరగా రేవంత్ రెడ్డి కి దమ్ముంటే సిఏం గా రాజీనామా చేసి మల్కాజ్ గిరిలో పోటీ చేద్దాంరా అంటూ ప్రతి సవాల్ విసిరారు.

మల్కాజీగిరి పార్లిమెంట్ కి నువ్వు సిట్టింగ్ ఎంపీ కదా నువ్వు నేను కలసి పోటీ చేద్దాం దా ఇద్దరం మల్కాజగిరి ఎంపీ కి పోటీ చేద్దాం అంటూ సవాల్ చేసారు.రేవంత్ దమ్ముంటే సిఏం పదవికి రాజీనామా చేయండి మల్కాజ్ గిరిలో పోటీ చేద్దాం సిట్టింగ్ సీటే కదా దమ్ముంటే పోటీకి రావాలని నేను సిరిసిల్లలో ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేస్తా దమ్ముంటే రేవంత్ సిఏం పదవికి రాజీనామా చేసి పోటీకి రావాలని సవాల్ విసిరాడు.

తెలంగాణ భవన్ లో మీడియాతో కేటిఆర్ చిట్ చాట్ నిర్వహించారు.సీఎం రేవంత్ రెడ్డి పై పలు సంచలన వ్యాఖ్యలు చేసాడు నువ్వు మగాడివేతే రైతులకు ఇచ్చిన రెండు లక్షలు రుణమాఫీ అమలు చెయ్ అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేర్చు అని అన్నారు.ఒక్క సీట్ అయినా గెలువు అన్నావుగా రేవంత్ రెడ్డి మల్కాజీగిరి పార్లిమెంట్ కి నువ్వు సిట్టింగ్ ఎంపీ కదా నువ్వు నేను కలసి పోటీ చేద్దాం దా..ఇద్దరం మల్కాజగిరి ఎంపీ కి పోటీ చేద్దాం..సేఫ్ గేమ్ వద్దు స్ట్రెయిట్ ఫైట్ చేద్దాం అని చాలెంజ్ చేసారు.
కేసీఆర్ ని బద్నామ్ చేద్దాం అని మీరు ప్రయత్నం చేయలని చూస్తున్నారని కేసీఆర్ పైన చర్యలు తీసుకుంటాం, గత ప్రభుత్వంలో పని చేసిన వారి పైన చర్యలు తీసుకుంటాం, జైల్లో పెడతాం అని అంటున్నారు, మాకు న్యాయస్థానాలు పైన నమ్మకం ఉందని అన్నారు.

మోడీ కాంగ్రెస్ పైన ఎన్నో ఆరోపణలు చేస్తారు అవన్ని నిజం అనుకుంటున్నారా గతంలో కడెం ప్రాజెక్ట్ గేట్లు కొట్టకుపోయినాయి అవన్నీ అవినీతి ప్రాజెక్టు లా అని ప్రశ్నించారి.నేనే ముఖ్యమంత్రిని, నేను పిసిసి అధ్యక్షుడుని అని గొంతు చించుకొని ఎందుకు అరుస్తున్నావు మెడిగడ్డ పైన మర్మత్తులు జరపండి..రైతులకు నీళ్లు ఇవ్వండి నిపుణులతో కమిటీ వేయండి, తప్పులు ఉంటే చర్యలు తీసుకోండి మా మీద కోపంతో రైతులకు అన్యాయం చేయకండని అన్నారు.

గెలిచిన ప్రతిసారి మగవాడిని ఒడితే కాదు అంటావా కొడంగల్ లో ఒడిపోయినప్పుడు మగాడివికాదా మగాడివి అయితే…రైతులకు 2 లక్షల రుణ మాఫీ చేయు..అడబిడ్డలకు 2500 ఇవ్వు… ఇచ్చిన 420 హమీలు అమలు చేయ్యి..అడవాళ్లు రాజకీయాల్లో గెలవవద్దా… ఇదే మాటాలు రేవంత్ కు ఇన్ పిరియారిటీ కాంప్లెక్స్ ఉందని కేటీఆర్ అన్నారు.కొండగల్, జియచ్ యంసి సమయంలో పోటీ చేసి సవాల్ విసరి పారిపోయిండని అయన మాటకు విలువ ఏం ఉందని అన్నారు.రాజకీయాల్లో గెలుపు ఒటములు సహాజమని

నాది మేనేజ్ మెంట్ కోటా అయితే రాహుల్, ప్రియంక లది ఏం కోటా అని ప్రశ్నించారు.రేవంత్ ది పేమేంట్ కోటా… మానికం ఠాకూర్ కి డబ్బులిచ్చి పదవులు తెచ్చుకున్న పేమేంట్ కోటా అని పేమేంట్ కోటాలో సీటు తెచ్చుకున్నందుకే రేవంత్… డీల్లీకి పేమేంట్ చేయాలని బిల్డర్లను బెదిరించాలి… వ్యాపారులను బెదిరించాలి… డీల్లీకి కప్పం కట్టాలి, బ్యాగులు మోయాలి…అందుకే భవన నిర్మాణ అనుమతులు అపినారని విమర్శించారు… ఇప్పటివరకు ఎన్ని అనుమతులు ఇచ్చారో చెప్పాలని త్వరలో బిల్డర్లు, వ్యాపారులు రేవంత్ సెస్ పైన రోడ్డు ఎక్కుతారని అయన నేనే సిఏం అని అన్ని సార్లు చెప్పుకుంటున్నారు అయనకు అయననే సిఏం అన్న నమ్మకం లేదా అని కేటీఆర్ ఎద్దేవా చేసారు.

సెన్స్ ఎవరికీ లేదో ప్రజలకు తెలుసని మీకే కామన్ సెన్స్ లేదని అన్నారు, మేము మేడిగడ్డ వెళ్తుంటే, కాంగ్రెస్ వాళ్లు వేరే యాత్రకు వెళ్తున్నారు.నీళ్ళను ఎలా ఎత్తిపోయాలో ఆలోచన చేయాల్సింది పోయి, మాపై బట్ట కాల్చి మీదా వేస్తున్నారు.మీకూ చేతకాక పోతే తప్పుకొండి… మేము చేసి చూపిస్తాం… హరీష్ రావు గారే చేసి చూపిస్తారు.ఒకరి పై ఒకరు సెన్స్ లేదనీ మాట్లాడుకోవడం బంద్ చేసి పనులు చేయండి.NDSA రిపోర్ట్ రాజకీయ కక్ష పూరితంగా ఉన్నది… NDSA అధికారుల రిపోర్ట్ ను డైరెక్ట్ మీడియాకు ఇచ్చారు.

రేపు ఉదయం 8-30 గంటలకు తెలంగాణ భవన్ నుండీ మేడీగడ్డకు వెళ్తున్నాము .మేడిగడ్డ , అన్నారం వెళ్తున్నాము, అన్నారం దగ్గర ప్రజెంటేషన్ ఇస్తున్నాము,ప్రజెంటేషన్ ఇరిగేషన్ ఎక్స్ పట్స్ వస్తున్నారు.200 మందీ తెలంగాణ భవన్ నుండి బయలుదేరి వెళ్తున్నామని గతంలో సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఇలాంటివి చాల జరిగినవని కేటిఆర్ అన్నారు.

Share