ktr మేడిగడ్డకు కేటీఆర్
మార్చ్ 1వ తేదీన చలో మేడిగడ్డకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నాయకులు తెలంగాణ భవన్ నుంచి మేడిగడ్డకు బయలుదేరుతామని తెలిపారు.దశల వారిగా కాలేశ్వరంలో ఉన్న ప్రతి రిజర్వాయర్ని సందర్శిస్తామని మాతో కాంగ్రెస్ మంత్రులు వస్తాము అంటే వారిని కూడా వెంట తీసుకువెళ్తామని అన్నారు.ప్రజలకు కాలేశ్వరం ద్వారా అందుతున్న ఫలాలను వివరిస్తామని మేడిగడ్డ పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను ఎండబెడతామని మేడిగడ్డలో రెండు మూడు పిల్లర్లకు పగుళ్లు వస్తే ప్రాజెక్టుని మొత్తం కూల్చే కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు.కాంగ్రెస్ హయాంలో కడెం ప్రాజెక్టు, గుండ్ల వాగు, మూసి ప్రాజెక్ట్, సింగూర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ, పులిచింతల వంటి అనేక ప్రాజెక్టుల్లో సమస్యలు వచ్చాయని అన్నారు.పాడైన బారాజుల మరమ్మత్తుకు ఇంజనీరింగ్ పరిష్కారాలు ఉన్నాయని సులువుగా ఒక కాపర్ డ్యాంని నిర్మాణం చేసి ఆ మూడు పిల్లర్లకు వెంటనే మరమత్తులు నిర్వహించవచ్చని తెలిపారు.మరమ్మతులు ఒకవైపు నిర్వహిస్తూనే అందుకు బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలని శాసనసభలోనే మేము చెప్పామని మీరు వేసిన ప్రతి విచారణను స్వాగతించామని రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలిపారు.
కాళేశ్వరం పై కుట్ర జరుగుతుందన్న కేటీఆర్
రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్న రైతు ప్రయోజనాలే అందరికీ ముఖ్యంగా ఉండాలని కాపర్ డ్యాం నిర్మాణం చేసి వెంటనే మేడిగడ్డకు మరమత్తులు నిర్వహించండని కోరారు.రానున్న వేసవిలో మంచినీళ్లు ఇవ్వలేము సాగునీరు ఎట్లిస్తాం అని ప్రభుత్వ అధికారులే చెప్తున్నారని అవసరమైతే మాపైన దుష్ప్రచారం చేయండి ఇంకేమైనా చేయండి కానీ రైతుల జీవితాలను మాత్రం దెబ్బతీయకండి అని మీడియా సాక్షిగా తెలిపారు.మూడు పిల్లర్ల నష్టాన్ని చూపించి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ మానివేసి, ప్రాజెక్టు మరమత్తుల పైన దృష్టి సారించాలని అన్నారు.మరమ్మతులు నిర్వహించకపోతే మూడు బారాజులు కొట్టుకుపోవాలని కుట్రను కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదని రానున్న వర్షాకాలంలో మూడు బరాజులను, వచ్చే వరదతో కొట్టుకపోయే విధంగా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని దుయ్యబట్టారు.నేరుగా రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు చెప్తున్నారని అన్నారం, సుందిల్ల కూడా కొట్టుకుపోతుందని చెప్పారని అన్నారు.ఇది ప్రాజెక్టు కొట్టుకుపోవాలని కుట్రపూరిత ఆలోచనలో భాగమేనని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, మేడిగడ్డకు సందర్శన లాంటి అన్ని డ్రామాలు అయిపోయినాయి కాబట్టి ఇప్పటికైనా సమస్య పరిష్కారం పైన దృష్టి పెట్టండి అని అని అన్నారు. కమిటీలు, రిపోర్టుల పేరుతో కాలయాపన చేయకుండా సమస్యకు పరిష్కారం చూపించండని రాష్ట్ర రైతాంగంపైన మా పార్టీపైన కక్షపూరిత వైఖరి మానివేయండని హితవు పలికారు.నిజంగా కాంగ్రెస్ పార్టీకి రైతులపైన తెలంగాణ పైన ప్రేమ ఉంటే ప్రాజెక్టుకి మరమత్తులు చేసి నీళ్లు ఎత్తిపోయాలని కాంగ్రెస్ పార్టీ కేవలం నేరపూరిత మనస్తత్వంతోనే బరాజ్ లకు రిపేర్లు చేయకుండా రోజుకు వేల క్యూసెక్కుల నీటిని ఇప్పుడు కూడా సముద్రంలోకి వదిలిపెడుతుందని అన్నారు.ఇందులో కాలేశ్వరం బ్యారేజీలు అన్ని వర్షాకాలంలో కొట్టుకుపోవాలనే పెద్ద కుట్ర ఉందని అన్నారు.
కాగ్ రిపోర్ట్ పై కేటీఆర్ కామెంట్స్
కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటున్న కాగ్ రిపోర్ట్ పైన కాంగ్రెస్ పార్టీ ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి మొదలుకొని ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దాకా అందరూ కాక రిపోర్టుని తప్పుపట్టారని కాగ్ రిపోర్ట్ ఒక పవిత్ర గ్రంథం ఏం కాదు అని కాగ్ రిపోర్ట్ తప్పు అని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పారని గుర్తు చేసారు.కాగ్ రిపోర్ట్ కాంగ్రెస్ జిల్లా యజ్ఞాన్ని అనేక భూముల కేటాయింపును కల్వకుర్తిలో 900 కోట్ల రూపాయలకు గురించి అనేక అంశాలను కాంగ్రెస్ ప్రస్తావించిందని మరి కాగ్ రిపోర్టు అప్పుడు తప్పు అయితే మరి ఇప్పుడు ఎలా కరెక్ట్ అవుతుందో ముఖ్యమంత్రి చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేసారు.అప్పటి కాగ్ రిపోర్ట్ విషయంలో ద్వంద ప్రమాణాలు వేరువేరు వాదనలు కాంగ్రెస్ ఏ విధంగా చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అప్పులపై అడ్డగోలుగా మాట్లాడుతుందని కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే కొత్తగా అప్పులు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నడిపించండని అన్నారు.కెసిఆర్ జలసాధన పోరాటం ద్వారా పల్లె పల్లెను జాగృతం చేశారని కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన… తర్వాతనే కాంగ్రెస్ పార్టీ జల యజ్ఞం పేరుతో నాటకాలకు తెరలేపిందని పదేళ్లపాటు నాటకాలు ఆడి జల యజ్ఞాన్ని ధనయజ్ఞం గా మార్చుకుందని అన్నారు.ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఇక్కడ కాంగ్రెస్ ఒకటే పార్టీ అధికారంలో ఉన్న మహారాష్ట్ర తో ఒప్పందం చేసుకోకుండా తుమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా తవ్వలేదని ఒక్క కాలువ కూడా తవ్వకుండా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో అడ్డగోలుగా నిధులు దోచుకున్నారని ఆనాటి జల యజ్ఞంలో 52,000 కోట్ల అవినీతి అని కాగ్ రిపోర్ట్ ఎండగట్టిందని అన్నారు.10 ఎండ్లలో ప్రాజెక్టులకు ఒక్కటంటే ఒక్క అనుమతి కూడా సాధించని దుర్మార్గపు పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ గారు నిపుణులతో, కేంద్ర ప్రభుత్వ సంస్థలతో, మహారాష్ట్రతో సంప్రదించిన తర్వాత గోదావరి నీళ్లను తెలంగాణ పొలాలకు మళ్లించాలన్న సంకల్పంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాలేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని సెంట్రల్ వాటర్ కమిషన్, తుమ్మిడి హాట్టి వద్ద సరిపడా నీటి లభ్యత లేదు అన్న తర్వాతనే నిపుణుల సలహాలు, సంప్రదింపుల తర్వాతనే మేడిగడ్డ వద్ద నీళ్లు తీసుకోవడం మేలని కాలేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని అన్నారు.
కేటీఆర్ మాటల్లో కాళేశ్వరం అంటే..
కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదు 3 బ్యారేజీలు,15 రిజర్వాయర్లు,21 పంప్ హౌజ్ లు,203 కిలోమీటర్ల సొరంగాలు,1531కిలో మీటర్ల కాలువలు,98 కిలో మీటర్ల ప్రెజర్ మెయిన్స్..141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ..530 మీటర్ల ఎత్తుకు నీళ్ల ఎత్తిపోత..240టిఎంసీల వినియోగం !అన్నింటి సమహారమే కాళేశ్వరం అని కొత్త నిర్వచనం చెప్పారు.88 మీటర్ల పల్లం నుంచి 618 మీటర్లు ఎత్తుకు గోదారి గంగ ఎగిసి దుంకే..జలదృశ్యాన్ని ఆవిష్కరించామని అన్నారు.కాలేశ్వరం అంటే కేవలం మేడిగడ్డ అన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని తెలిసినా తెలవనట్లు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కాలేశ్వరంలో పొంగిపొర్లుతున్న నీళ్లను ప్రజలకు చూపిస్తామని దుష్ప్రచారం చేస్తున్న మేడిగడ్డకు కూడా మా పార్టీ ప్రతినిధి బృందం వెలుతుందని కెసిఆర్ నల్లగొండ సభలో చెప్పినట్లు కాలేశ్వరంలోని అన్ని ప్రాజెక్టులు, రిజర్వాయర్లను సందర్శించి ప్రజలకు వివరిస్తామని అన్నారు.లక్ష కోట్ల కాలేశ్వరం అని ఒకవైపు, 3000 కోట్లతో కట్టిన మేడిగడ్డను చూపించి ఇదే కాలేశ్వరం గురించి దుష్ప్రచారం చేస్తున్నారని మేడిగడ్డలో పాడైన మూడు పిల్లర్లను చూపించి కాలేశ్వరం విఫల ప్రాజెక్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. 40 లక్షల ఎకరాలకు నీరు అందించే కామదేనువు కాలేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ టోపోగ్రఫీకి ఉన్న వాళ్ళ సవాళ్ల వల్లనే, గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా అన్ని ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేసామని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నో కేసులు వేసి ప్రాజెక్టు కట్టకుండా అడ్డంకులు సృష్టించిందని ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కేసీఆర్ కి పేరు వస్తుందని దుర్మార్గంగా వ్యవహరించిందని అన్నారు.కాంగ్రెస్ కుట్రలకు దాటుకుని 400 పైగా అనుమతులు సాధించామని కాంగ్రెస్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 16.4 టిఎంసిలు, రిజర్వాయర్లు లేకుండా ప్రాజెక్టు ఉంటే, 142 tmc రిజర్వాయర్లను కలేశ్వరంలోనిర్మించామని అన్నారు.తెలంగాణ కొత్త ఆయకట్టు, స్థిరీకరించిన ఆయకట్టు ద్వారా 40 లక్షల ఎకరాలను చేసే ప్రాజెక్టే కాలేశ్వరం తెలంగాణకు ఉన్న భౌగోళిక పరిస్థితుల పరిమితుల వల్లనే ఎంత ఖర్చైనా ఎత్తిపోతల పథకాల ద్వారానే నీలి నుంచే అవకాశం ఉన్నదని అన్నారు.
నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణ రైతన్నల కోసం ఎంత ఖర్చైనా నీళ్లు ఇవ్వక తప్పదని కాస్ట్ బెనిఫిట్ అనాలసిస్ అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్న మేధావులు కొన్ని విషయాలు తెలుసుకోవాలని అన్నారు.ఆకలికేకల తెలంగాణ అన్నం గిన్నగా మారి దేశానికి అన్నపూర్ణగా అయిందని మూడు కోట్ల టన్నుల ధాన్యం పండించారని రైతుల మూడు లక్షల ఎకరం ఈరోజు 30 లక్షలు అయింది… ఇవన్నీ కాళేశ్వరం ద్వారా అందిన ప్రతి ఫలాలు కాదా అని ప్రశ్నించారు.కాలేశ్వరం ద్వారా అందిన ఆయకట్టు మీద చేస్తున్న దుష్ప్రచారం చేస్తున్న వాళ్లు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అన్నారు.ఎస్సారెస్పీ కట్టిన తర్వాత 25 వేల ఎకరాలకు నిలిచింది నాగార్జునసాగర్ కట్టిన తర్వాత 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చిందని కల్వకుర్తి 30 ఏళ్ల తర్వాత 13వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేసారు.