బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి లేఖ రాశారు.ఈ లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. సీఅర్పిసి సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి లేదా ఉపసంహరించుకోండి అని సీబీఐకి విజ్ఞప్తి చేసారు.సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని లేఖలో స్పష్టం చేశారు.ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్య ఈ నెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని తెలిపారు.
సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని 2022 డిసెంబరులో అప్పటి ఐవో ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారని పేర్కొన్నారు.గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగ ఉందని సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదని నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపజేస్తున్నదని అన్నారు.
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావునిస్తోందని ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని అన్నారు. ప్రజాస్వామిక, రాజ్యంగ హక్కులకు భంగం కలిగిస్తుందని సిబిఐ చేస్తున్న ఆరోపణల్లో నా పాత్ర లేదని పైగా ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు.
ఈడీ నోటీసులు జారీ చేయగా నేను సుప్రీం కోర్టును ఆశ్రయించానని కేసు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉందని పేర్కొన్నారు.నన్ను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారని సుప్రీంకోర్టు లో హామీ సీబీఐకి కూడా కూడా వర్తిస్తుందని అన్నారు.గతంలోనూ సీబీఐ బృందం హైదరాబాద్ లోని నా నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించానని నియమనిబంధనలకు కట్టుబడి ఉండే దేశ పౌరురాలిగా సీబీఐ దర్యాప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తానని తెలిపారు.
కానీ 15 నెలల విరామం తరువాత ఇప్పుడు పిలవడం మరియు సెక్షన్ల మార్పు అనేక అనుమానాలకు తావిస్తుందని పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నాకు మా పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించిందని రానున్న ఆరు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైందని పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేనని పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులను నిలిపివేతకు పరశీలించండని లేఖలో ప్రస్తావించారు.