దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సిబిఐ మరోసారి నోటీసులు పంపింది. ఇదివరకు ఒకసారి ఎమ్మెల్సీ కవిత ఇంటివద్దనే స్టేట్మెంట్ తీసుకున్న సిబిఐ ఈ నెల అంటే ఫిబ్రవరి 26 న విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపించింది.దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లిక్కర్ స్కామ్ కేసు మరోసారి తెరపైకి రావడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఇదివరకు లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెమెంట్ డైరెక్టరేట్ ఎమ్మెల్సీ కవితను విచారించింది.
ఈడీ విచారణకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టు ను ఆశ్రయించింది కాగా ఈ కేసు సుప్రీంకోర్టు లో విచారణలో ఉండగానే లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు అందజేయడంతో రాజకీయంగా చర్చ ప్రారంభమైంది.అయితే కవిత సుప్రీంకోర్టు ను ఆశ్రయించడంతో విచారణ అయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈడీ కి సుప్రీంకోర్టు ఆదేశించింది.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సిబిఐ నోటిసులు అందించడంతో లిక్కర్ స్కామ్ కేసు మరోసారి తెరపైకి వచ్చినట్టయింది.అయితే సిబిఐ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత ఎలా స్పందిస్తారు ? విచారణకు హాజరవుతారా లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. గతంలో కూడా ఈడీ నోటీసులకు కవిత హాజరుకాలేదు ఇప్పుడు ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠగా మారింది.అయితే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతలు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.మరోసారి ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు రావడంతో ఎమ్మెల్సీ కవిత ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.