kcr birthday

kcr birthday ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

తెలంగాణ భవన్ లో జరిగిన సంబురాల్లో పాల్గొన్న పార్టీ సీనియర్ నాయకత్వం,పార్టీ శ్రేణులు..

ఆటో డ్రైవర్లకి ప్రమాద బీమా పత్రాలు,దివ్యాంగులకు వీల్ చైర్లు అందించిన కేటీఆర్..

70 కిలోల భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన పార్టీ నాయకులు..

కెసిఆర్ పై డాక్యుమెంటరీ ప్రదర్శన..

BRS పార్టీ వ్యవస్థాపక అద్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70 వ జన్మదిన వేడుకలు శనివారం తెలంగాణ భవన్ లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ సంబరాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సీనియర్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు హాజరయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి KTR ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొపెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.జన్మదిన వేడుకల సందర్బంగా తలసాని సాయి కిరణ్ యాదవ్ సహకారంతో వెయ్యి మంది ఆటో డ్రైవర్ లకు ఒకొక్కరికి లక్ష రూపాయల కవరేజీతో కూడిన ఇన్సురెన్స్ పత్రాలను,10 మంది దివ్యాంగులకు వీల్ చైర్ లను కేటీఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కేసీఆర్ 70 వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా తయారు చేయించిన 70 కిలోల భారీ కేక్ ను రాజ్యసభ సభ్యులు కేశవరావు, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, మాజీ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి కేటీఆర్ కట్ చేశారు. అనంతరం కేసీఆర్ జీవిత, రాజకీయ, తెలంగాణ ఉద్యమ నేపధ్యంతో ప్రత్యేకంగా రూపొందించిన అతనే ఒక చరిత్ర డాక్యుమెంటరీ ని వీక్షించారు.

పార్టీ కార్యకర్తల కుటుంబాలకు BRS పార్టీ అండగా ఉంటూ ఆదుకుంటుందని మాజీమంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కలిగి ప్రమాదవశాత్తు మరణించిన 70 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒకొక్కరికి 2 లక్షల రూపాయలు చొప్పున ప్రమాద భీమా క్రింద మంజూరైన ఆర్ధిక సహాయం చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి,బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ భవన్ ఆవరణలో తెలంగాణ ఉద్యమం, KCR ఆమరణ దీక్ష విశేషాలను వివరించేలా ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ వేడుకలలో ఎంపీ లు రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, సీనియర్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి, మాజీ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనా చారి, మాజీ కార్పోరేషన్ చైర్మన్ లు సోమా భరత్ కుమార్, అనిల్ కుమార్ కూర్మాచలం, వాసుదేవ రెడ్డి, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మేడే రాజీవ్ సాగర్, సతీష్ రెడ్డి, మసి ఉల్లా ఖాన్, పలువురు కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు

Share