ponnam prabhakar

Ponnam Prabhakar అసెంబ్లీలో కులగణన తీర్మానం చారిత్రకఘట్టం-మంత్రి పొన్నం ప్రభాకర్

ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో లో పెట్టిన విధంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కుల గణన సర్వే ద్వారా బడుగు బలహీన వర్గాలకు మేమెంతొ మాకంతా అన్న విధంగా నిన్న తెలంగాణ శాసనసభ కుల గణన తీర్మానాన్ని చేసింది.మేము మాట ఇచ్చాము ఆ మాట ప్రకారం నిర్ణయం తీసుకున్నాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

కులగణన ని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినందుకు సభ్యులందరికి ధన్యవాదాలు తెలిపారు.అదేవిధంగా
రాహుల్ గాంధీ ,సోనియా గాంధీ,మల్లికార్జున్ ఖర్గే,కేసి వేణుగోపాల్ ,దిపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మా సహచర మంత్రులు, వివిధ పార్టీల ఎమ్మెల్యేలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు.

అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్నాకే కులగణన ప్రవేశపెట్టామని మేం ఎవరికి వ్యతిరేకం కాదని అన్నారు.బడుగు బలహీన వర్గాలు సామాజిక ,రాజకీయ, ఉద్యోగాల్లో ఎదగాలని మా ప్రభుత్వ ఆకాంక్ష అని అన్నారు.మాజీ బీసీ వెల్ఫేయిర్ మినిస్టర్ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో అనేక సార్లు సభను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించారని అన్నారు.తీర్మానం పై అనుమానం వ్యక్తం చేయడం పట్ల మంత్రి తీరును ఎడగట్టారు…

బీసీ ల పట్ల చిత్తశుద్ది ఉంటే 10 సంవత్సరాల్లో మీ గొంతు ఎందుకు మాట్లాడలేకపోయిందని సకల జనుల సర్వే రిపోర్ట్ ఎందుకు బయటపెట్టలేదని ఎప్పుడైనా మీ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ లో అడిగార అని ప్రశ్నించారు..సలహాలు సూచనలు ఇవ్వమంటే ఎంత సేపు విమర్శలు చేసే ఆలోచనతో పోతున్నారని అనుమానాలు పక్కన పెట్టి ఇప్పటికే కుల గణన జరిపిన అయా రాష్ట్రాల నుంచి తెలుసుకోవాలని మాజీ మంత్రిని ఉద్దేశించి అన్నారు.

జనగణన సర్వే 100 శాతం ప్రయోజనం జరిగే విధంగా ముందుకు పోతామని నిధుల కొరత లేదు ఎలాంటి అనుమానం అవసరం లేదని ధీమాగా చెప్పారు.మురళీధర్ రావు కమిషన్ లో విద్యార్థి దశ గా ఉన్నప్పటి నుండే దీని పై ఉద్యమించామని పార్లమెంట్ లో బిల్లు ఆమోదం పొందే వరకు మేము ఉన్నామని చెప్పారు.

1931లో చేసిన తరువాత 2011లో మన్మోహన్ సింగ్ గారి నాయకత్వం లో జరిగిందని ఆ తరువాత ఇప్పుడే కుల గణన జరుగుతుందని భవిష్యత్ లో పిబ్రవరి 16 మరో చారిత్రాత్మక ఘట్టమని మంత్రి పొన్నము ప్రభాకర్ పేర్కొన్నారు..

మేధావులు ఎవరైనా సలహాలు సూచనలు చెప్పాలని ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అమలు చేసి తీరుతామని అన్నారు.ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు అమలు చేశాం నా డిపార్ట్మెంట్ ఇది కూడా నా డిపార్ట్మెంట్ పరిధిలో కుల గణన తీర్మానాన్ని ప్రవేశపెట్టామని బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తామని అన్నారు.ఎంబిసి కోసం గత ప్రభుత్వం వెయ్యి కోట్లు ఇచ్చి రూపాయి కూడా విడుదల చేయలేదని దుయ్యబట్టారు.

మున్నూరు కాపు,ముదిరాజ్ ,యాదవ్,పద్మశాలి లకి ప్రత్యేక సంస్థ ఉండడానికి కృషి చేస్తామని అన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఒక్కోటి చేస్తామని త్వరలో కుల వృత్తులకు ఆధునిక మైన ,సాంకేతిక అంశాలను జోడించి ఉపాధి నీ పెంపొందించేలా కృషి చేస్తామని అన్నారు.బీసీల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని సర్కార్ వచ్చి 70 రోజులు కాలేదు ఎవరు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

Share