హైదరాబాద్ నుంచి విజయవాడకు మ్యాచ్ ఆడేందుకు వెళ్ళిన విమెన్స్ టీమ్ కి అనుకోని సంఘటన జరిగింది.రిటర్న్ లో ఫ్లైట్ కి రావాల్సి ఉండగా కావాలని కోచ్ జైసింహా డిలే చేసినట్టు ప్లేయర్లు చెబుతున్నారు. ఫ్లైట్ మిస్ అవడంతో బస్ లో హైదరాబాద్ కి బయల్దేరిన విమెన్స్ టీమ్ మహిళా క్రికెటర్ల ముందే జై సింహా మద్యం సేవించాడు.మహిళా క్రికెటర్లు అడ్డు చెప్పడంతో వాళ్ళను బూతులు తిడుతూ మద్యం సేవించినట్లు ప్లేయర్లు తెలిపారు.ఈ విషయంపై మహిళ క్రికెటర్లు HCA కి ఫిర్యాదు చేశారు..దింతో కోచ్ జై సింహ పై విచారణకు ఆదేశించినట్టు అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపారు.
హైదరాబాద్ టీమ్ బస్సులో హెడ్ కోచ్ విద్యుత్ జైసింహా మద్యం సేవిస్తూ కనిపించిన వీడియోలు వాట్సాప్ గ్రూప్‌లు, టీవీ చానెళ్లల్లో ప్రత్యక్షమవడంతో అతడిపై తక్షణం వేటు వేస్తున్నట్టు హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఉత్తర్వులు ఇచ్చారు.దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి, సదురు కోచ్‌పై తదుపరి చర్యలు తీసుకుంటామని జగన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ఇలాంటి చర్యలు ఉపేక్షించబోమని జగన్‌మోహన్ రావు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో తెలిపారు.
ఇదిలా ఉండగా కోచ్ జై సింహా పై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ మహిళ క్రికేటర్ల తల్లిదండ్రులు లేఖ రాశారు. జనవరి లో లేఖ రాసిన మహిళా క్రికెటర్ల పేరెంట్స్ కోచ్ జై సింహా కు పలువురు అండగా ఉన్నారని లేఖలో ప్లేయర్ల తల్లిదండ్రులు పేర్కొన్నారు. తాగుడుకు బానిసైన కోచ్ జై సింహా తమ ముందు మద్యం తాగొద్ధని పలుమార్లు వారించిన మహిళ ప్లేయర్స్.ఎన్ని సార్లు చెప్పిన తీరు మార్చుకొని కోచ్ .ప్రశ్నిస్తే టీం లో నుండి తీసేస్తామని బెదిరింపులు చేసినట్టు తెలిపిన ప్లేయర్లు.బీసీసీఐ కు కూడా మహిళా క్రికెట్ ప్లేయర్ పేరెంట్స్ పిర్యాదు చేసారు.ఈనేపథ్యంలో జై సింహా పై విచారణ కు HCA ఆదేశాలు జారీచేశారు.జై సింహా తీరుపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోచ్ పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలని HCA ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఆదేశాలు జారీ చేశారు.
మహిళా క్రికెటర్ల రక్షణ కు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని జగన్మోహన్ రావు స్పష్టం చేశారు. క్రిమినల్ కేసులు పెడతామని పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరుతామని మహిళా క్రికెటర్లకు HCA అండగా ఉంటుందని జగన్మోహన్ రావు తెలిపారు.